లడ్డు ప్రసాదాన్నిపామర్తి దంపతులకు అందజేసిన ఆలయ అధికారులు
తాడువాయి గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి లడ్డుని (Swamy vari Laddu) పామర్తి వెంకటేశ్వరావు దంపతులు కైవసం చేసికొన్నారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు.
స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములలో భాగంగా 5వ రోజు స్వామివారి వద్దనున్న లడ్డు వేలంపాట బుధవారం రాత్రి నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు స్వామివారి దగ్గర పూజలు అందుకున్న ఈ లడ్డుని వేలం పాటలో పామర్తి వెంకటేశ్వర రావు దంపతులు దక్కించుకున్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పామర్తి వెంకటేశ్వరరావు పద్మావతి దంపతులు పాల్గొని రూ. 63 వేల రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్నారు. దేవస్థాన చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, సత్రం లక్ష్మణరావు, కనికళ్ల ప్రసాద్, పాల రామకృష్ణ, కల్లూరి రాధాకృష్ణ, వేలంపాటలో కైవసం చేసుకున్న లడ్డుని దంపతులకు అందజేశారు.
–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు