Nadendla Manohar on Jaganann mosamNadendla Manohar on Jaganann mosam

పేదల ఇంటి కలను దూరం చేసిన ప్రభుత్వం
ఇళ్ల పేరుతో భారీ అవినీతి తంతు
జనసేన బయటపెడుతున్న పేదల ఇంటి కష్టాలను వైసీపీ అడ్డు
చవకబారు ట్రిక్స్ వదిలి క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి
చెరువుల్లా జగనన్న కాలనీ స్థలాలు… అరకొర నిర్మాణాలు నాసిరకమే
భారతీ సిమెంట్… ఇండియా సిమెంటుకే ప్రాధాన్యం ఏమిటో?
‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో నిజాలు నిగ్గు తేలాయి
వీడియో ప్రకటనలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘వైసీపీ నాయకులు (YCP Leaders) కమీషన్ ఏజెంట్లుగా (Commission Agents) మారి, జగనన్న ఇళ్ల పథకపు భూ సేకరణలో (Land acquisition) దోచుకున్నారు. పేదల ఇళ్ల పేరుతో జరిగిన భారీ అవినీతికి (Big scam) ప్రభుత్వమే పచ్చజెండా ఊపింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులపై ఆసక్తికార ఆరోపణలు చేసారు.

“2020లో నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి (AP CM Jagan) ఏకంగా 30.75 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో కోటి 27 లక్షల మందికి లబ్ది కలుగుతుందని ఆర్బాటంగా చెప్పారు. తర్వాత ఆ లెక్క 28 లక్షలకు మారింది. తాజాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సోషల్ ఆడిట్ తర్వాత కేవలం 21 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మిస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇది అంతా గందర గోళంగా ఉన్నది అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

7 లక్షల ఇళ్లు ఏమైపోయాయి?

28 లక్షల ఇళ్లు అని జీవోలు ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 21 లక్షలు అయింది. మరి 7 లక్షల ఇళ్లు ఏమయి పోయాయి..? వాటి లబ్దిదారులు ఎక్కడ? అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి, దానిలో రూ.23,500 కోట్లు కేవలం స్థల సేకరణకు ఇచ్చారు. కేవలం 46 గజాల స్థలంలో నలుగురు సభ్యుల కుటుంబం ఉండటం సాధ్యమేనా..? స్థల సేకరణ విషయంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు అని మనోహర్ అన్నారు.

గుంకలాంలో ఎస్పీల భూములే 300 ఎకరాలు

రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్ అయిన గుంకలాంలో (Gunkalam) 387 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించారు. దీనిలో సుమారు 300 ఎకరాలు ఎస్సీల వద్ద నుంచి చాలా తక్కువ ధరకు వైసీపీ నాయకులు రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షలకు కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి మాత్రం రూ.34.50 లక్షల పరిహారం పొందారు. దీనిలోనే ఎంత భారీ అవినీతి ఉందో అర్ధం అవుతుంది. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించతలపెట్టిన 17 వేల జగనన్న కాలనీల్లో ఎంత మేర ప్రజాధనం పక్కదారి పట్టిందో అర్ధమవుతుంది. జనసేన పార్టీ చేపట్టిన “జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు” పథకంలో భాగంగా ప్రతి చోటా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసు కున్నామని అన్నారు .

దీనిలో మంత్రులు తమ ఆక్రోషాన్ని జన సైనికులు, వీర మహిళలపై చూపారు. పెడన, రాజమండ్రి, మంగళగిరి, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మంత్రులు చేసిన చీప్ ట్రిక్స్ పనిచేయలేదు. ఎక్కడా వెనక్కు తగ్గకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి అన్నది రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు పంపడం నిజంగా అభినందనీయమని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద… లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నారు. జూన్, 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 1.52 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని అధికారికంగానే తెలుస్తోంది. డిసెంబరు నాటికి 5 లక్షల గృహాలను నిర్మిస్తామని చెబుతున్నారు. అంటే పూర్తిస్థాయిలో గృహాలను మేం నిర్మించ లేకపోతున్నాం… అని వారే ఒప్పుకుంటున్నారు. దీనిలోని వాస్తవ పరిస్థితిని, జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజెప్పేందుకు వెళ్లిన జనసైనికులను అడ్డుకోవాలని చూడటం మూర్ఖత్వం అని మనోహర్ అన్నారు.

ఇళ్లను లబ్దిదారులకు అందించడం లేదు

టిడ్కో ఇళ్లను (Tidco Houses) లబ్దిదారులకు అందించడం లేదు. రాజకీయ కారణాలతో పేదలను ఇబ్బంది పెట్టడం ఏమిటి? జగనన్న కాలనీల్లో అద్భుతంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి 2020 డిసెంబర్ లో ప్రకటించారు. కాలనీల్లో ఇంటర్నల్ రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, ఆట స్థలాలు, లైబ్రరీ, అప్రోచ్ రోడ్లు, వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నాం… అంతే కాదు వైర్లెస్ ఇంటర్నెట్ ఇస్తున్నాం అన్నారు. వాస్తవం ఏమిటంటే – అసలు ఆ కాలనీలకు వెళ్లడానికి సరైన రోడ్లే లేవు… ఆ కాలనీలు నీట మునిగి ఉంటున్నాయి. ముఖ్యమంత్రి పేదలను మభ్యపెట్టే మాటలు మాత్రమే చెబుతున్నారు అని జనసేన వైసీపీ నాయకాకులపై కీలక ఆరోపణలు చేసారు.

భారీ స్కాం అనేది నూటికి నూరుపాళ్లు నిజం

జగనన్న కాలనీల్లో (Jagananna Colonies) నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ సామగ్రి సైతం అత్యంత నాసిరకంగా ఉంది. అక్కడ వాడుతున్న సిమెంటు నాణ్యతా బాగాలేదు. పునాదులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు వాడే సిమెంటు సైతం భారతీ సిమెంటు, ఇండియా సిమెంట్సు మాత్రమే వాడుతున్నారు. అనంతపురంలో మా నాయకులు, కార్యకర్తలు ఒక లే అవుట్ పరిశీలించారు. పునాది తేలిపోయి ఉంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని వేమగిరిలో లే అవుట్ చెరువును తలపిస్తోంది. అలాంటి చోట ఇళ్లను ఎలా నిర్మిస్తారు? వీటిపై ప్రశ్నించే లబ్దిదారులను వాలంటీర్లు బెదిరిస్తున్నారు. పింఛన్లు ఆపేస్తాం.. డబ్బులు రాకుండా చేస్తాం అంటూ రకరకాలుగా భయ పెడుతున్నారు. ఇళ్ల కలలన్నీ కల్లలయ్యేలా నిర్మాణం గతి తప్పుతుంటే ఏ చేయాలో, ఎవరిని ప్రశ్నించాలో కూడా తెలియని అయోమయ స్థితిలో పేదలు ఉండిపోతున్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం సరైన రీతిలో ఖర్చు చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వలేకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కాలనీల పేరుతో భారీగా దోచుకోవడానికి వేసిన ప్రణాళిక తప్ప… పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేయాలనుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అంటూ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.

జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళల ధైర్యానికి అభినందనలు

పార్టీ ఇచ్చిన సూచనలు, పిలుపును తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు, వీర మహిళలు జగనన్న ఇళ్లు పరిస్థితిని ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో తెలియజేయడం అభినందనీయం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చిత్రాల రూపంలోనూ సోషల్ మీడియాలో #JaganannaMosam పేరుతో తెలియజేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, బెదిరింపులకు లొంగకుండా అన్నిచోట్లా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం. అన్ని ప్రాంతాల నుంచి కేంద్ర కార్యాలయానికి జగనన్న ఇళ్లపై నివేదికలు వచ్చాయి. కచ్చితంగా వీటిని ప్రభుత్వానికి అందజేసి.. క్షేత్రస్థాయి స్థితిని వారికి తెలియ జెప్పడం బాధ్యతగా భావిస్తాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రభుత్వం పేదల ఇళ్లను నాణ్యతగా నిర్మించి ఇచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుంది. పేదల ఇంటి కలను సాకారం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ప్రశ్నించేవాడు లేకపోతే అవినీతికి చట్టబద్ధత
జనసేనకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతి లేకుండా చేస్తా

Spread the love