Buggana with employees

బుగ్గనతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల ప్రకటన
దశలవారీగా సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
సమస్యల పరిష్కారానికి లిఖిత హామీ
ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి
సీఎంకు వివరించిన సజ్జల, బుగ్గన

ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన ఉద్యమాన్ని తాత్కాలింగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు (Employees union Leaders0 ప్రకటించారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతోపాటు రాతపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించిందని వారు వివరించారు. అయితే పీఆర్సీపై (PRC) భారీ అంచనాలు పెట్టుకోవద్దు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Rama Krishna Reddy) ఉద్యోగులు, పెన్షనర్లకు సూచించారు.

ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ దశలవారీగా, త్వరగా పరిష్కరిస్తాం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (Buggana Rajendranadh Reddy) ఉద్యోగులకు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పడంతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.

పీఆర్సీతోపాటు ఇతర అంశాలపై నెలకొన్న సందిగ్థత గురువారం కూడా కొనసాగింది. అటు సజ్జల, ఇటు బుగ్గన, అధికారులు ఉద్యోగ సంఘాల (Employees Unions) ప్రతినిధులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చల మీద చర్చలు జరిపారు. పీఆర్సీపై మంగళ, బుధవారాల్లో జరిపిన చర్చల వివరాలను సజ్జల, బుగ్గన సీఎం (CM) దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సజ్జల మీడియాతో (Media) మాట్లాడారు. ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర విషయాలపైనా ముఖ్యమంత్రితో చర్చించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుంటే పరిస్థితి బాగానే ఉండేది. మనం ఇప్పుడు గతంతోనూ ఇతర రాష్ట్రాలతోనూ పోల్చుకునే పరిస్థితి లేదు. సీఎస్‌ కమిటీ సిఫారసు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ (Pitment) అమలు చేస్తూ ఐఆర్‌కు రక్షణ ఉండేలా తప్పక చూస్తాం. వేతన సవరణపై (Pay revision) భారీ అంచనాలకు తావు ఉండకపోవచ్చు.

ఉద్యోగులకు మాత్రం నష్టం లేకుండా చూస్తాం. ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నాం. పీఆర్సీ తర్వాత వారి గ్రాస్‌ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటాం. 27 శాతం ఐఆర్‌ కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం ఉండవచ్చు. పీఆర్సీ ప్రక్రియ శుక్రవారానికి పూర్తి కావొచ్చు అని సజ్జల పేర్కొన్నారు.

దశలవారీగా సమస్యల పరిష్కారం

గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ సమీర్‌ సమీర్‌శర్మ తదితరులు సచివాలయంలో ఉద్యోగుల జేఏసీలు, ఉద్యోగుల సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని, ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులను బుగ్గన, సీఎస్‌ కోరారు. తాము ఇచ్చిన 71 అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఉద్యమాన్ని వాయిదా వేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం మంత్రి బుగ్గన, ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడి ఉద్యమం విరమణ అయ్యేటట్లు కృషి చేశారు.

అదనపు పోస్టులను భర్తీ?

అమరావతి (Amaravati) సచివాలయంలో (Secretariat) ఉన్న అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. సచివాలయంలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కూడా చెప్పామన్నారు.

లిఖితపూర్వక హామీ ఇస్తారు!

ప్రభుత్వం (Government) తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడంతోపాటు… దీనిపై రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినందునే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎర్రకాలువ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలి