రోజస్తమానూ కష్టపడే కష్టజీవులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు (Jagananna Chedodu) పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పేర్కొన్నారు. కష్టజీవులను పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ కుప్పకూలుతుంది అని ఏపీ సీఎం (AP CM) అన్నారు. రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద రూ. 285.35 కోట్ల నగదును జగన్ విడుదల చేశారు. 2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును ఏపీ సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
అత్యంత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం !
“దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. స్వయం ఉపాధి కార్యక్రమంలో (Self employment) అత్యంత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న రంగం ఇది. దాదాపుగా 2.85 లక్షల మంది ఈ రంగంపై ఆధార పడ్డారు. ఇటువంటి చేతివృత్తులు చేసుకుంటూ, బతకలేని పరిస్థితికి నెట్టివేయబడే పరిస్థితినే వస్తే వ్యవస్థనే కుప్పకూలుతుంది. వీరందరికీ మంచి చేసేందుకు, తోడుగా నిలిచేందుకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇది ఒక గొప్ప అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. తాము వివక్షకు గురైనా కూడా మన సామాజంలో ఇంటింటికీ అనేక సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. నిజంగా వృత్తిపరంగా రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలు..సేవలందిస్తున్న షాపులు ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం తోడ్పాటు నిస్తున్నాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, తోడుగా ఉండేందుకు ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం” అని సీఎం జగన్ వివరించారు
బీసీలంటే కేవలం పని ముట్లు కాదు..
బీసీలంటే (BC) బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు..సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ (Back bone class) అని నిండు మనసుతో నమ్మాం. అధికారంలోకి వచ్చిన తరువాత ఆచరించామని సగర్వంగా నేడు చెప్పా గలుగుతున్నాను. ఈ వృత్తివర్గాల జీవితాల్లో మెరుగైన మార్పు రావాలని, మిగతా ప్రపంచంతో పోటిపడి ఎదగాలని కోరుకొంటున్నాను. అందుకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలని మనసా, వాచా,ఖర్మన నేను తపిస్తున్నాను. అందుకే ఈ వర్గాల అభ్యున్నతి కోసం అనేక పధకాలను అమలు జరుపుతున్నాను అని సీఎం జగన్ అన్నారు.