Pawan Kalyan at NITPawan Kalyan at NIT

నిద్రపుచ్చే కోటరీ యుద్ధానికి సిద్ధం అవ్వనిస్తుందా?

చిరులో మార్పు రాకుండా యుద్ధమా?

నూరవసారి యుద్ధం (Nooravasari yuddham) చేయడం తధ్యం అంటూ జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ట్వీట్ నేడు సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ఈ ట్వీట్ మీదనే చర్చ జరుగుతున్నది.

ఒక మార్పు కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. నూరవసారే యుద్ధం చేస్తాను అని రాసి ఉన్న ఒక ఫోటోను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది.

శిశుపాలుడు (Sisupala) చేసిన వంద తప్పులను మాత్రమే క్షమిస్తాను అన్న శ్రీకృష్ణుడు (Srikrishna) మాటలను తెలుగు ప్రజలు ఈ సందర్భంగా స్మరించుకొంటున్నారు. మార్పు కోసం ఎదురుచూస్తున్నారు కూడా.

ఇంతకీ జనసేనాని (Janasenani) ఇప్పటికి వరకు భరించిన ఆ తప్పులు ఎన్ని? ఎప్పటితో ఆ 99 శాంతియుత పోరాటాలు ముగుస్తాయి? 2024 లో యుద్ధం చేయడం తధ్యమేనా? ఇవే ప్రజలందరిలో మెదులుతోన్న ప్రశ్నలు.

అయితే జనసేనానిని దేవుడుగా భావించే జనసైనికులు (Janasainiks) యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ సైనికులకు ఆదేశాలు ఇచ్చే కమాండెంట్స్ (Commandants) మాత్రం జనసేనలో (Janasena) తగినంత మంది కనిపించడం లేదన్న విషయాన్నీ జనసేనాని ఎంత తొందరగా తెలిసికొంటే అంత మంచిది.

నిద్రపుచ్చే కోటరీ యుద్ధానికి సిద్ధం అవ్వనిస్తుందా?

జనసేనాని చుట్టూ కోటరిగా (Pawan Kotary) ఆ నలుగురు ఉన్నారు. వీరు సేనానిని యుద్ధానికి సిద్ధం చేయాలిసిన అవసరం ఉంది. యుద్ధం చేయాల్సి వస్తే తన సైన్యాన్ని యుద్ధానికి అనుగుణంగా మార్చుకోవాలి ఇది నిరంతర ప్రక్రియ. మూడు నెలలు ముందు వస్తే సరిపోదు అని చెప్పాల్సి ఉంది. కానీ ఆ నలుగురు ఆ పని చేస్తున్నట్లు అనిపించడం లేదు.

జనసేనానిని ఎలా నిద్ర పుచ్చుదాము అనే ఆలోచనలోనే ఆ నలుగురిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. ప్రతీ జనసైనికుడిలో ఇదే అభిప్రాయం ఉంది. మా దేవుడిని నిద్రపుచ్చుతున్నారు అనే వేదనతో జనసైనికులు రగిలి పోతున్నారు. 

యుద్ధం చెయ్యాలి అంటే సైన్యం కావాలి. ఆయుధాలు కావాలి. తంత్రాలు కావాలి. నిరంతర తర్ఫీదు కావలి. సలహాదారులు కావాలి. కానీ అవి అన్నీ మన జనసేనకు ఉన్నాయా? లేవా? లేక పోతే ఏమిచేయాలి? (Preparation for war) అనేది ఒక్కసారి జనసేనాని ఆలోచించాలి. అలానే ఎన్నికలకు మూడు నెలలు ముందు వస్తే సరిపోతుంది అనే సలహా దారుల కుట్రలో పడి పార్టీ ఏమైనా మోసపోతున్నాదా? అనేది కూడా జనసేనాని ఆలోచించాలి.

చిరులో మార్పు (Change in Chru) రాకుండా యుద్ధమా?

జనసేనానిలో ఉన్నది నిరంతం ప్రజ్వరిల్లే అగ్నిలాంటి శివతత్వం (Sivatatva). దీనికి విష్ణు తత్త్వం (Vishnu Tatva) తోడు అవ్వాలి. రాక్షస మూకల అంతం అవ్వడానికి విష్ణు తత్త్వం, శివతత్వం కలయిక అనివార్యం. మన వేదం సారం (Vedas) చెబుతున్నది కూడా ఇదే. అలానే చిరంజీవిలో (Chiranjeevi) ఉన్నది విష్ణు తత్త్వం. దాన్ని కలుపుకోవడానికి ప్రయత్నాలు తక్షణమే జరగాలి.

నేను అందరివాడిని అనిపించుకోవాలి అనే ధర్మరాజు కత్తిపట్టిన తరువాత మాత్రమే యుద్ధం మొదలు అయ్యింది అనేది జనసేనాని (Janasenan0 గుర్తు చేసికోవాలి. అలానే నేను అందరివాడిగా ఉండాలి అనే చిరు కూడా యుద్ధానికి సిద్ధం కావాలి. జనసేనతో కలవాలి. దానికి మనం అంతా చిరుని యుద్ధానికి సిద్ధం చేయాలి. అలా చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే ఎందుకు అలా జరగడం లేదు? మీ యుద్ధ తంత్రాల్లో ఇదే కీలకమైన ఘట్టం.

నువ్వు దేవుడివి సామి. యుద్ధ తంత్రాలు నీకు తెలియనివి కావు. యుద్ధ తంత్రాలపై మా ఆవేదనతో కూడిన అక్షర సత్యాలను (Akshara Satyalu) మీ మనో నేత్రంతో ఒక్కసారి చూడండి.

ఆలోచించండి…సైన్యాధికారులను (Team leaders) నిద్రపుచ్చే కోటరీ ఆలోచనల్లో మార్పు తీసికొని రండి. అప్పుడే విజయం మీదవుతుంది. రేపటి రోజు మనదవుతుంది.

గవర్నర్’ని కలిసిన ఏపీ సీఎం జగన్ దంపతులు