వానలతో కొట్టుకుపోయిన వంతెనలు.. ధ్వంసమైన రోడ్లు
తిరుపతి సమీపంలోని రాయలచెరువుకు గండి
కట్టుబట్టలతో పునరావాస ప్రాంతాలకు బాధితులు
దెబ్బతిన్న వరి, మెట్ట పంటలు
ఉవ్వెత్తున వచ్చిన వరద (Floods) ధాటికి పలు వంతెనలు Brindges) కూలుతున్నాయి. పలు రోడ్లు (Roads) ద్వంసం అయ్యాయి. ఊర్లు నీట మునిగే ఉన్నాయి. రైలు పట్టాలు (Railway Tracks) నీటిలో తేలియాడుతున్నాయి.. పలు పల్లెలు (Vilages), పట్టణాలు (Towns) ఇప్పటికీ వణుకుతూనే ఉన్నాయి.
భారీ వర్షాలకు (Heavy Rains) కడప (Kadapa), నెల్లూరు (Nellore), చిత్తూరు (Chitoor), అనంతపురం (Ananthapuram) జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట, ఆస్తి నష్టాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రాజదారి (National Highway)పై నెల్లూరు దాటాక రహదారి ఓ వైపు కొట్టుకుపోయింది. నెల్లూరు జిల్లా (Nellore District) పడుగుపాడు సమీపంలో ట్రాక్ మీదకు నీరు రావడంతో పలు రైళ్లను నిలిపేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయల చెరువుకు లీకేజీ ఏర్పడి వంద గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది.
ఒకపక్కన వానలు వదలడం లేదు. మరొక పక్కన వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి వరదనీరు వస్తుడడంతో దిగువన ముంపు పెరుగుతోంది. రాయలసీమ నుంచి వచ్చే వరదతో నెల్లూరు జిల్లాలోని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటల నష్టం పెరుగుతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం శనివారం పేర్కొంది. పునరావాస కేంద్రాల్లోని వారికి ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపింది.
వరద ప్రభావిత గ్రామాల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటరు పామాయిల్, కిలో చొప్పున కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లి పంపిణీ చేయాలని రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ సంబధిత కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది ఇలా ఉండగా ప్రభుత్వం (Government) ఆదుకోవడం లేదని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానరావడం లేదని బాధితులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు (Ministers) తగువిధంగా స్పందించడం లేదని, ఆదుకోవడం లేదని కోపోద్రిక్తులవుతున్నారు.