Gudem JanasainikGudem Janasainik

ధర్మాజీగూడెం (Dharmajigudem) గ్రామానికి చెందిన జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్త పామర్తి నాగరాజు (Pamarty Nagaraju) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియ జేసింది. అంతే కాకుండా చింతలపూడి నాయకుల సహకారంతో చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేకఈశ్వరయ్య ఆధ్వర్యంలో 50000 రూపాయలను ఆర్ధిక సాయంగా (Financial Assistance) అందజేసింది.

జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు (Reddy Appala Naidu) చేతుల మీదుగా నాగరాజు కుటుంబ సభ్యులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు , జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్వరి, జిల్లా సంయుక్త కార్యదర్శి తూము వవిజయ్ కుమార్, లింగపాలెం, మండల అ్యక్షుడు పంది మహేష్ బాబు, చింతలపూడి మండల అధ్యక్షుడు మధుబాబు, మాదాసి కృష్ణ, పటాన్ యాకువల్లి, చల్ల నాగబాబు, పూజారి సురేష్, పంది సతీష్, మునికొండ గోపి, పంతగాని రాజు, పటాన్ సుభాని, బంటు సామ్యూల్, నిమ్మగడ్డ రామ్ కుమార్, మరియు లింగపాలెం మండలం జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

వైసిపి మంత్రులకు మాకినీడి శేషుకుమారి స్ట్రాంగ్ కౌంటర్!!

Spread the love