Deyyaalu vedaluDeyyaalu vedalu

కధే కావచ్చు. కానీ రక్తాక్షరాలతో రాసిన కన్నీటి గాధ

అధికార మదంతో పిశాచాలు కత్తులతో, కర్రలతో వీధులవెంట తిరుగుతూ చెలరేగిపోతున్నాయి. అమ్ముడుపోతున్న అమాయకపు బక్క జీవులకు కూడా ఇది తప్పు అని చెప్పాలని ఉంది. అలానే పిశాచాలని (Devils) ఎదిరించాలని ఉంది. కానీ ఎదిరిస్తే ఎక్కడ తమపై పిశాచాలు విరుచుకు పడతాయో అని నక్కి నక్కి జీవనం కొనసాగిస్తున్నారు. బిక్కు బిక్కు మంటూ తల్లడిల్లి పోతున్నారు.

ధర్మజ్ఞుడు మాత్రం పిశాచాలపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. నూరడం తప్పు కాదు. కానీ అధికారం కోసం దెయ్యాలు వల్లిస్తున్న వేదాల వెనుక ఉన్న అధికార దాహాన్నిధర్మజ్ఞుడు అర్ధం చేసికోలేక పోతున్నారు.

జ్ఞానం ఉన్న బక్క జీవులు అజ్ఞానంతో…

బక్క జీవుల సమూహాన్ని పట్టి పీడిస్తున్న పిశాచాలపై, దెయ్యాలపై పోరాడాల్సిన బక్క జీవుల సంఘాలు ఎంగిలి మెతుకులు వేరుకొంటూ ధర్మజ్ఞుడిని మాత్రమే అణచడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న బక్క జీవులు సైతం అజ్ఞానంతో ఈ గుంటనక్కలను అర్ధం చేసికోలేక పోతున్నారు. పిశాచాలు, దెయ్యాలు ఉచ్ఛరించే వాటినే వేదాలుగా నమ్ముతూ తమ జీవితాలను నరకప్రాయం చేసికొంటున్నారు.

అధికారాన్ని కోల్పోయిన దెయ్యాలు ఇదే అదునుగా భావిస్తున్నాయి. దాహం దాహం అంటూ బక్క జీవులను పీల్చుకు తినడానికి మరోమారు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే అధికారం పోయిన దెయ్యాలు కన్నీరు కారుస్తూ వేదాలు వల్లిస్తున్నాయి. దెయ్యాలను నియంత్రించే మీడియా మాంత్రికులు దెయ్యాలు వల్లించే ఆ వేదాలనే శాస్త్రాలుగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

మీడియా (Media) మాంత్రికులలో (Manthrika) కొందరు పిశాచాలు నిర్వర్తించే ప్రతీ కర్మ ధర్మమే అంటూ కితాబు ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. పిశాచాలను కాపాడుకొంటూ వస్తున్నారు. అలానే మీడియా మాంత్రికులలో మరికొందరు పిశాచాలదే తప్పు. మా దెయ్యాలు కారుస్తున్న కన్నీరే వేదాలు అంటూ ప్రజల మనస్సులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. బక్క జీవులు మాత్రం అర్ధంగాని వ్యర్ధాల్లా మిగిలిపోతున్నారు.

ధర్మజ్ఞుడు దెయ్యాల ప్రతినిధులను చుట్టూ పెట్టుకొని…

ధర్మజ్ఞుడు మాత్రం పిశాచాలపై పగ కొనసాగిస్తున్నాడు. తప్పు లేదు. కానీ పొంచిఉన్న దెయ్యాల అధికార దాహాన్ని అర్ధం చేసికోలేక పోతున్నాడు. దెయ్యాల ప్రతినిధులను చుట్టూ పెట్టుకొని తన కర్తవ్య నిర్వహణని సరిగా చేయలేక పోతున్నాడు అని ఆ దేవుడే మదనపడుతున్నాడు.

పిశాచాలు, దెయ్యాలు కూడా బక్క జీవులకు అన్యాయం చేస్తున్నాయి… అని చెప్పాల్సిన ధర్మజ్ఞుడు దెయ్యాల ప్రతినిధులను వెంటపెట్టుకొని మాత్రమే తన పోరాటం కొనసాగిస్తున్నాడు అంటూ మీడియా మాంత్రికులు, గుంటనక్కలు చెబుతున్నాయి. ఇలా చెప్పే గుంట నక్కల మాటలనే అమ్ముడుపోతున్న బక్కజీవులు కూడా నమ్ముతూ వస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టే యంత్రాంగాన్ని ధర్మజ్ఞుడు ఇప్పటికీ తయారు చేసికోలేక పోతున్నాడు.

మీడియా మాంత్రికులు చెబుతున్నదే వేదాలుగా గుంటనక్కలు, బక్కజీవులు కూడా భావిస్తున్నాయి. జ్ఞానం ఉన్న అజానపు బక్క జీవులు అచేతనులై జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నాం అని చెప్పుకొంటున్నారు.

దెయ్యాలను, పిశాచాలను మాత్రమే దైవంచ సంభూతులుగా భవిస్తూ తమ ప్రభువులుగా ఎన్నుకొంటున్నాయి.  మరొపక్కన దారి ఉన్నాగాని ఏదారిలో వెళ్లాలో ఎంచుకోలేని బలహీనుడుగా ధర్మజ్ఞుడు మిగిలిపోతున్నాడు.

వీరిని అందరినీ నియంత్రించాలిన హస్తిన పెద్దలు, ధర్మాన్ని నిల్పాల్సిన హస్తిన ప్రభువులు… ఇది ఒక పేదరాశి పెద్దమ్మ కధలో భాగమే అనుకొంటూ తమ పని తాము చేసికొంటూ పోతున్నారు. పీక్కూ తినేవారికే మద్దతు నిస్తున్నట్లు కనిపిస్తున్నది అని బక్క జీవులు భావిస్తున్నారు. అంతేగాని ధర్మజ్ఞుడికి  అండగా ఉంటే దెయ్యాల, పిశాచాలా బారి నుండి బక్క జీవులకు రక్షణ ఉంటుంది అని భావించడం లేదు. 

దెయ్యాలు, పిశాచాలు వల్లిస్తున్నవే వేదాలనా? దీనికి పరిస్కారం కనుగొందాం అంటూ అక్షర సత్యాలు చేస్తున్న రోదనలు అరణ్య రోదనలు గానే మిగిలిపోతున్నాయి. ధర్మజ్ఞుడిలో అవసరమైనంత చైతన్యాన్ని తీసికొని రాలేకపోతున్నాయి?

ఆలోచించండి… ఇది కధే కావచ్చు. కానీ రక్తాక్షరాలతో రాసిన కన్నీటి గాధల సారం అని అర్ధం చేసికోండి

దెయ్యాలు: ప్రమాదికారివి
పిశాచాలు: చాలా ప్రమాదకారివి
కామినీలు: అత్యంత ప్రమాదకారివి అనే వూహపై రాసినది అని గమనించగలరు

(ఇది పేదరాశి పెద్దమ్మ కధలోని భాగమే గాని ఎవ్వరిని ఉద్దేసించినది కాదు. మీ రాజకీయ పార్టీలను గాని, పార్టీల అధిపతులను గాని లేదా మరెవ్వరినీ గాని పోల్చుకొని చదవద్దు.)

Damodaram Sanjeevaiah Smaraka Project by Janasenani

(Its from Akshara Satyam)

Spread the love