Ramappa TempleRamappa Temple

రామప్ప దేవాలయం (Ramappa Temple) అరుదైన విశ్వఖ్యాతిని ఆర్జించింది. అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి ప్రతీకగా మిగిలింది మన రామప్ప దేవాలయం. రామప్ప ఆలయం తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు (mulugu) జిల్లాలో ఉంది. 2020 సంవత్సరానికి ప్రపంచస్థాయి కట్టడంగా యునెస్కో (Unisco) గుర్తింపు పొందింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ వెల్లడించారు.

44వ యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశాలలో ఈ నిర్ణయం తీసికొన్నారు. ఆదివారం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ, చర్చలో రామప్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడ్డాయి. అవన్నీ వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచే కావడం విశేషం. రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపును దక్కించుకుంది.

Spread the love