Janasena on aarogyasri Janasena on aarogyasri

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని జగన్ పేదల పక్షమా?
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే
పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి అరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి

వైసీపీ పాలకుల (YCP Government) అసమర్థ ఆర్థిక నిర్వహణ వల్ల ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) ఆరోగ్యశ్రీ (Aarogyasri)సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు బకాయిపడింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరినా సరిగా స్పందించలేదు అని జనసేన పార్టీ ఆరోపించింది.

అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు వైద్యం చేయిస్తున్నాం అని మభ్యపెట్టే ప్రయత్నాలే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు కొనసాగించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు గత నెలలోనే తేల్చి చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు. ఇదేనా పేదల పక్షంగా ఉన్నామని గొప్పలు చెప్పుకొనే వ్యక్తి పాలన అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అని తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి నిజంగా పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి నిధులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూడాలి. చిత్తశుద్ధి ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి అని నాదెండ్ల డిమాండ్ చేసారు.

ఆంధ్రాలోఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతుందని జనసేన పార్టీ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయింపు సక్రమంగా లేదు, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా పేదలు ఇబ్బందిపడతారు అని జనసేన పార్టీ నుండి పదేపదే చెప్పాం. అయినా మా మాటలు పాలకుల చెవికెక్కలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. ప్రతిపక్షాలను విమర్శ చేయడమే పాలనా అనుకొనే ముఖ్యమంత్రి ముందుగా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు.

అధికారమే లక్ష్యంగా పొత్తులు అన్న పవన్ కళ్యాణ్: పార్టీ క్యాడర్’లో జోష్