Nadendla-Kothapeta JanasenaNadendla-Kothapeta Janasena

పి ఎ సి ఛైర్మన్ నాదెండ్లకు బ్రహ్మరధం

కొత్తపేటలో (Kothapeta) బండారు శ్రీనివాస్ (Bandaru Srinivas) ఆధ్వర్యాన, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar చేతులు మీదుగా ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేశారు. డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట నియోజక వర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి నుండి వస్తున్న మనోహర్’కు ఘనస్వాగతం పలికారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఈతకోట గ్రామం నుండి సుమారు 2000 వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించు ఆహ్వానించారు. ఈ బైక్ ర్యాలీ ఈతకోట నుండి కొత్తపేటలోని సభా ప్రాంగణం వరకు కొనసాగింది. అనంతరం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ఉమ్మడి జిల్లాల నాయకులతో, జనసైనికులతో బారీ సమావేశం ఏర్పాటు చేసారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, గాయపడిన క్రియాశీలక సభ్యత్వ సభ్యుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చెక్కులను అందచేశారు.

Nadendla-Kothapeta Janasena
Nadendla-Kothapeta Janasena

రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాలలో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులకు భీమా చెక్కులను జనసేన తరపున పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఎన్నో ప్రజా సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి జనసేనాని కృషి చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుల్లో నడుస్తూ అయన ఆశయాల ప్రయాణాన్ని జనసైన్యం సాగిస్తున్నది. అటువంటి సైన్యం ఎలాంటి అపత్కాలంలో ఇబ్బందులు పడకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తుంటారు.

ఎంతో నిబద్ధతతో పార్టీ భావజాల వ్యాప్తికి, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీ కొరకు అనుక్షణం శ్రమించే తమ పార్టీ కార్యకర్తలను కుటుంబంగా జనసేనాని భవిస్తూ ఉంటారు. వారి యోగ క్షేమాలను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ కాంక్షిస్తూ ఉంటారు. పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే జనసేన కార్యకర్తల ఆకస్మిక మరణం, లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. జనసేన పార్టీ జనసైనికుల కుటుంబాలకు భరోసాని కల్పిస్తుంది అని అన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్ల డీల్!

Spread the love