వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) జీవిత కాల అసమ్మతి వాది. కడప జిల్లాలో కాంగ్రెస్‌లో తన వర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కక పోవడం కారణంగా 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి (Telugudesam) మద్దతు నిచ్చారు. అప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) వద్ద ప్యాకేజీ తీసుకునే వైస్సార్ టీడీపీకి మద్దతు నిచ్చారా? వైస్సార్ టీడీపీకి మద్దతు నివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) వెన్నుపోటు పొడిచారని దక్షిణ భారత కాపు సంఘం (SIKA) ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు (Velpuri Srinivas Rao) ఒక ప్రకటనలో విమర్శించారు.
చంద్రబాబు నాయుడు పై హైకోర్టులో 26 కేసులు వేసి ఆ తరువాత ఆ కేసులను ఉపసంహరించు కొన్నారు. ఎలాంటి కారణం లేకుండా ఆ కేసులను ఎందుకు ఉపసంహరించుకున్నారు. బాబు వద్ద కేవలం ప్యాకేజీ తీసికొని అన్ని కేసులను ఉపసంహరించుకున్నారా అని వేల్పూరి శ్రీనివాస్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కస్టపడి సంపాదించుకొన్న ఆదాయం నుండి కోట్ల రూపాయలు ప్రజలకు వివిధ రూపంలో ఇస్తున్నారు. సాయం చేస్తున్నారు. అటువంటి జనసేనానిని వైసీపీ నాయకులు ప్యాకేజీ స్టార్ అనడం సిగ్గుచేటు అని వేల్పూరి శ్రీనివాస్ అన్నారు. జైలు బెయిల్ పార్టీ నేత జగన్ మాత్రమే అని వేల్పూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 సంవత్సరాల వైఎస్ఆర్ కుటుంబ చరిత్ర అంతా నేరాలు, ఘోరాలు, హత్యలు, ప్యాకేజీలు, కిడ్నాప్ లు, క్విడ్ ప్రోకోలు, అవినీతి ,నమ్మక ద్రోహం, భూకాబ్జాలు కాదా అని వేల్పూరి శ్రీనివాస్ ఆరోపించారు.
వైస్సార్ పిసీసీ అద్యక్షుడుగా ఉన్న సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎంపీక చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులను తొలగించి, 100 మందికి MLA టిక్కెట్లు అమ్ముకొన్నాడని, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పిన విషయం వాస్తవమా కాదా అని వేల్పూరి ప్రశ్నించారు.
ముక్యమంత్రి పదవి కోసం హిందూ ముస్లింల మద్య చిచ్చు పెట్టి 400 మంది అమాయకుల హత్యకు వైఎస్సార్ కారణం అయ్యడని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం నిజమా కాదా అని వేల్పూరి విమర్శించారు.
పై ఆరోపణలు అన్నింటిపై వైసీపీ పార్టీ నాయకులూ వివరణ ఇవ్వాలని, వైస్సార్ కుటుంబంపై ప్రజలకు ఉన్న ఆరోపణలను నివృత్తి చేయాలనీ వేల్పూరి శ్రీనివాస్ ఆరోపించారు.
— వేల్పూరి శ్రీనివాస్, ప్రెసిడెంట్, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్