Janasenani-HBDJanasenani-HBD

రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో హోరెత్తించిన జనసేన శ్రేణులు
శ్రమదానంతో రహదారులకు మరమ్మతులు
ఆసుపత్రులు, అనాధాశ్రమాల్లో అన్నదానాలు
ఊరూరా జెండా దిమ్మెల ఆవిష్కరణలు
‘నా సేన కోసం.. నా వంతు’కు మద్దతుగా కార్యక్రమాలు
క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం చేపట్టిన పార్టీ నాయకులు
ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
జనసేనాని జన్మదినోత్సవాలకు పలు చోట్ల పోలీసుల ఆటంకాలు

జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు (President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదిన వేడుకలను (Birthday Celebrations) ప్రపంచ వ్యాప్తంగాను అలానే రాష్ట్ర వ్యాప్తంగాను పార్టీ శ్రేణులు (Party Cadre) ఘనంగా నిర్వహించాయి. ఉదయం నుంచి సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు పవన్ కళ్యాణ్’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేశారు. జనసేన (Janasena) అధినేత (President) జన్మదినాన్ని (Birthday) పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించాయి.

మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో (Mangalagiri Party office) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి.. ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్, పార్టీ నాయకులు మండలి రాజేష్ లతో పాటు మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో అంబరాన్ని తాకిన సంబరాలు

అనంతపురం జిల్లా (Ananthapuram District) జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి. వరుణ్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం నగరంలో ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమాన్ని తపోవనం సర్కిల్ లో నిర్వహించారు. నగర పరిధిలోని 50 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వేలాది మందిని భాగస్వాముల్ని చేస్తామని ఈ సందర్భంగా టి.సి. వరుణ్ తెలిపారు. అనంతరం పార్టీ మహిళా విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమానికి మొదటి విడతగా రూ. 1,00,116 చెక్కును టి.సి. వరుణ్’కి అందచేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక నారాయణపురం కాలనీలో జనసేన జెండా దిమ్మెను ఆవిష్కరించారు. మడకశిర నియోజకవర్గంలో అధ్యక్షుల వారి జన్మదినోత్సవం సందర్భంగా జనసేన శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి.

రాజంపేట, రైల్వేకోడూరుల్లో రక్తదాన శిబిరాలు

కడప జిల్లాలో (Kadapa District) జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదినోత్సవాల్లో భాగంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాజంపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన శ్రేణులు (Janasena Cadre) రక్తదానం చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ జనసైనికులు పలు ప్రాంతాల్లో రక్తదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి  తాతంశెట్టి నాగేంద్ర ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో అవయవ దానానికి అంగీకార పత్రాలు

తిరుపతి (Tirupati) ఎం.ఆర్.పల్లి సీతమ్మ నగర్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. రోజు మొత్తం ఇక్కడ నిరుపేదలకు అన్నదానం చేశారు. తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజరెడ్డి ఆధ్వర్యంలో తిరుచానూరు నవజీవన్ ఆశ్రమంలో దివ్యాంగుల మధ్య నిర్వహించిన వేడుకల్లోనూ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినూత కోట ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోహన్ ఫౌండేషన్ – జనసేన సంయుక్తంగా అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు అవయవదాన అంగీకార పత్రాల మీద సంతకాలు చేశారు.

నెల్లూరు జిల్లాలో నిరుపేదలకు అండగా….

నెల్లూరు జిల్లా (Nellore District) వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నెల్లూరు నగర పరిధిలోని ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలసి ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని, అలాంటి వ్యక్తికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా శ్రీ మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని, ప్రజా కంటక పాలకులకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. జనసేనాని జన్మదినోత్సవాల్లో భాగంగా కావలి నియోజకవర్గం ఇంఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యలో స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద నిరు పేదలకు అన్నదానం చేశారు. అనంతరం జనసైనికులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.

ఒంగోలులో ‘నా సేన కోసం.. నా వంతు’

ఉమ్మడి ప్రకాశం జిల్లా (Prakasam District) కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి ‘నా సేన కోసం… నా వంతు’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చీరాల నియోజకవర్గం, కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని క్రౌడ్ ఫండింగ్ ఆవశ్యకతను తెలియచెప్పారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన జెండా రెపరెపలు

గుంటూరు జిల్లా (Guntur District) వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ జిలాని, నయూబ్ కమాల్ ల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఊరూరా జనసేన జెండాను పార్టీ కార్యకర్తలు రెపరెపలాడించారు.

కృష్ణా జిల్లాలో పోలీసుల ఆటంకాలు….అయినా ఆగని కార్యక్రమాలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  జన్మదినోత్సవాలు కృష్ణా జిల్లా (Krishna District) వ్యాప్తంగా హోరెత్తాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జనసేన జెండా దిమ్మెలను పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మాహేష్, అమ్మిశెట్టి వాసులతో పాటు ఆయా నియోజకవర్గాల ఇంఛార్జులు ఆవిష్కరించారు. ప్రతి నియోజకవర్గంలో ‘నా సేన కోసం.. నా వంతు’ కార్య్రమాన్ని నిర్వహించారు. గుడివాడ , పామర్రు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పెడన నియోజకవర్గంలో ఎడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అవనిగడ్డ మండల కేంద్రంలో ఓ ఎస్సీ కాలనికి వెళ్లే రహదారికి జనసేన నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి మరమ్మతులు చేపట్టారు. అందుకు రూ. 25 వేలు ఖర్చు చేశారు. కృష్ణా జిల్లాలో గత రెండు రోజులుగా జనసేన పార్టీ కార్యక్రమాలకు పోలీసులు ఆటంకాలు కలిగిస్తూ వచ్చారు.

విజయవాడ (Vijayawada) పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జెండా దిమ్మె ఆవిష్కరణకు అనుమతి లేదంటూ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీ పోతిన మహేష్ తో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. పెడనలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. చివరికి ఈ కార్యక్రమాన్ని వేరొక చోటుకు మార్చుకోవాల్సి వచ్చింది.

పశ్చిమలో పండుగలా..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో (West Godavari District) పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వాడ వాడలా కార్యక్రమాలు జరిగాయి. ఉండి నియోజకవర్గం కాళ్ల మండల కేంద్రంలో తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారుల కోసం హోప్ ట్రస్ట్ వారికి 60 మంది జనసైనికులు రక్తదానం చేశారు. ఆచంటలో జరిగిన జన్మదిన వేడులకు పార్టీ పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆచంట ప్రభుత్వ పాఠశాలకు స్టేషనరి, విద్యార్ధులకు పుస్తకాలు బహూకరించారు.

తూర్పులో కోలాహలంగా

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District), రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో గ్రామ గ్రామాన జరిగిన జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాజమండ్రి శాటిలైట్ సిటీ డి-బ్లాక్, వేమగిరి తదితర ప్రాంతాల్లో జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన జెండా దిమ్మెలను ఆవిష్కరించారు. కడియపు సావరంలో ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టారు.

రాజమండ్రి రూరల్, పొట్టిలంక ప్రాంతాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రం గ్రామంలో అన్నసమారాధన నిర్వహించారు. అమలాపురం ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్లు, వీర మహిళల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు కానుకగా ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమం ద్వారా పార్టీకి విరాళాలు అందచేశారు. ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి మోటూరి కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అనాధలు, దివ్యాంగులు, వృద్దులకు అన్నదానం చేశారు.

ప్రత్తిపాడు నియోజకవర్గం, రౌతలపూడి మండల పరిధిలోని పల్లపు చామవరం గ్రామంలో పార్టీ నాయకులు శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు పాల్గొన్నారు. గ్రామ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టారు. కాకినాడ రూరల్ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

విశాఖలో భారీ ర్యాలీ

విశాఖపట్నంలోని (Visakhapatnam) గాజువాక (Gajuwaka) బీసీ రోడ్డులోని కాకతీయ జంక్షన్ లో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు ఆధ్వర్యంలో నిరు పేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలోని పలు అనాదాశ్రమాల్లో చిన్నారులకు అన్నదానం చేశారు. అనకాపల్లి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా 1400 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ నాయకులు క్రౌడ్ ఫండింగ్ ఆవశ్యకత తెలియచేస్తూ.. ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

జనసేన జెండా చూస్తేనే భయం భయం!