JaganJagan

ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపుతో 90 శాతం మందికి వర్తింపు
పొరుగు రాష్ట్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలు పొందే అవకాశం
ప్రొసీజర్లు (వ్యాధులు) 1,059 నుంచి 2,446కు పెంపు
రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం

మనిషి ప్రాణానికి (Human Life) విలువ ఇచ్చే ప్రభుత్వం (Government) ఇది. దాన్ని నిలబెట్టేందుకు.. వైద్యాన్ని పేద వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్రికరణ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (Jagan Mohan reddy) అన్నారు. గురువారం శాసనసభలో (Assembly) ఆరోగ్య రంగంపై (Health sector) జరిగిన చర్చలో జగన్ (Jagan) మాట్లాడారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి  (YSR Aarogyasri) రెండున్నరేళ్ల క్రితం వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని (Income Limit) వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 లక్షలకు పెంచామని జగన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తోందన్నారు.

రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు (Super Speciality Hospitals) పెద్దగా లేవన్న సంగతి తెలిసీ కూడా, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించే వారు కాదని చెప్పారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నామని, హైదరాబాద్, బెంగళూరు (Bangalore), చెన్నైలోని (Chennai) 130 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని జగన్ పేర్కొన్నారు.

గతంలో ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి అని చూసే వారు. కానీ నేడు వ్యాధి నయమయ్యే వరకు క్యాన్సర్‌ లాంటి వ్యాధులకు కూడా సాయం చేయడానికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంటున్నది.

హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (Heart Transplantation) శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కూడా ఆరోగ్య శ్రీ కిందకు తీసుకు వచ్చాం. ఒకదానికి రూ.6.3 లక్షలు,
29 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిపడిన రూ.680 కోట్లను నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. ఇప్పుడు 21 రోజులు దాటితే చాలు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నాం అని జగన్ వివరించారు.

వరుణుడి ప్రకోపానికి పలు జిల్లాల్లో విద్వంసం!