సీఎన్ఓఎస్ తాజా నివేదికలో జగన్ రాంక్ 20 / 25
మొదటి స్థానంలో నవీన్ పట్నాయక్
మొదటి 5 స్థానాల్లో ఒడిసా, యూపీ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్ సీఎంలు
సీఎన్‌వోఎస్ వెల్లడించిన సర్వేలో షాకింగ్
స్వల్పంగా మెరుగుపడిన మోదీ రేటింగ్
జగన్ ప్రభుత్వానికి (Jagan Government) షాకింగ్ సర్వే (Shocking Survey) రిపోర్ట్ అంటూ వార్త ఒకటి హల్చల్ చేస్తున్నది. సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (CNOS) తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని (Anti incumbency) వెల్లడించాయి.
ప్రధాని మోదీతోపాటు (Prime Minister Modi) దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్‌వోఎస్ (CNOS) బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే (Survey) నిర్వహించారు.
జగన్ 20వ స్థానంలో నిలిచారు. మొత్తం 25 మంది సీఎంలలో ఆయన అడుగు నుంచి ఆరో స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో 39 శాతం మంది ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) నాయకత్వంపై (Leadership) సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది ఏపీ సీఎం జగన్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు.
దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా.. 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో జనాదరణ పొందిన మొదటి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నవీన్ ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh), ఉద్ధవ్ ఠాక్రే (Maharashtra ex chief minister), హిమంత బిశ్వ శర్మ(Assam), భగవంత్‌సింగ్ మాన్ (Punjab) నిలిచినట్లు సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (CNOS) తా జాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ద్వారా తెలుస్తున్నది.
Data Courtesy : సీఎన్ఓఎస్ సర్వే నివేదిక ఆధారంగా