KTRKTR

బతుకమ్మ (Bathukamma) చీరల పంపిణీ (Sarees Distribution) అక్టోబర్ 9 నుండి జరుగుతుంది. ప్రతీ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ పధకాన్ని ప్రతిష్టాకరంగా చేపడుతున్నది. ప్రతీ సంవత్సరం ఒక కోటి నాణ్యమైన చీరలను పంచాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్నితెలంగాణ ప్రభుత్వం చేపట్టింది అని కేటీఆర్ అన్నారు. దీనివల్ల నేతన్నలకు కూడా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నట్లు ఆయన చెప్పారు.హైదరాబాద్ నగరంలోని హరిత ప్లాజాలో బతుకమ్మ చీరాల ప్రదర్శనను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్’తో కలిసి కేటీఆర్ (KTR) తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియ జేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటివరకు సుమారు నాలుగు కోట్ల చీరలు పంచినట్లు ఆయన తెలియ చేశారు.

ప్రభుత్వం ఇస్తున్న చీరలు మహిళలకు నచ్చడం అనేది చాలా సంతోషం అని ఆయన చెప్పారు. తమిళనాడు ప్రభుత్వ టెండర్ సైతం మన సిరిసిల్ల రైతన్నలకు వచ్చింది అని ఆయన తెలియ పర్చారు. ప్రభుత్వం అన్ని మతాలకు ఈ చీరలను పంచుతున్నది అని, ఈ బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమమం అక్టోబర్ 9 నుండి మొదలు అవుతుంది కేటీఆర్ తెలియ జేశారు.

రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాల ద్వారా ఈ పంపిణీ చేపడతామని, అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఈ చీరాల పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.