జంగారెడ్డిగూడెంలోని ఆయిల్ ఫామ్ రైతుల (Oil Farm farmers) సమస్యలు పరిష్కరించాలని ఆయిల్ ఫామ్ రైతుల సంఘం (Oil farm farmers association) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ (Pilli Subhash Chandra Bose), ఎమ్మెల్యే వీఆర్ ఎలీజాకు (V R Eleja) వినతిపత్రం అందజేశారు. ఏలూరు జిల్లా నవభారత్ పామాయిల్ కర్మాగారం పరిధిలో 9 మండలాల రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, మూడేళ్లుగా ఆయిల్ ఫామ్ మొక్కలు (Oil farm samples) అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకు వచ్చారు.
కర్మా గారం యాజమాన్యం మొక్కలు అందుబాటులో ఉంచడం లేదని ఆయిల్ ఫార్మ్ రైతులు వాపోయారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు సబ్సిడీ (Subsidy) ఇవ్వాలని, పంట ఉత్పత్తి ధర టన్నుకు రూ.19 వేలు ఖర్చు అవుతోందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం కనిష్ట ధర (MSP) రూ.20 వేలు ఉండేలా నిర్ణయించాలని కోరారు. ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అభ్యర్థించారు. విజ్ఞాపన పత్రం అందించా వారిలో అనేక మందిరైతు సంఘం ప్రతినిధులు ఉన్నారు.
–Garuvu Babu Rao from Jangareddygudem