Kodi pandaluKodi pandalu

సంక్రాంతి (Sankranti) ముసుగులో కోడిపందాలు (Kodi Pandalu) వేయరాదని జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సీఐ (CI) బాల సురేష్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో కోడి పందేలు, జూద క్రీడలు (Playing cards) చట్టరీత్యా నేరమని గ్రామస్తులకు గురువారం సీఐ బాల సురేష్ అవగాహన కల్పించారు. ముగ్గులు పోటీలు, వివిధ రకాల సాంప్రదాయ ఆటల పోటీలుతో సంక్రాంతి సంబరాలు (Sankranti Sambaralu) జరుపుకుందామని సీఐ బాల సురేష్ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ సాగర్ బాబు మాట్లాడుతూ కత్తి కడితే కటకటాలేనని సహించేది లేదన్నారు. కోడి పందాల నిర్వాహకులను పిలిచి పందేలు వేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. జూద క్రీడలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, బరులు ఏర్పాటు చేస్తే కేసులు (Police cases) నమోదు చేస్తామని ఎస్ఐ సాగర్ బాబు హెచ్చరించారు.

సోము వీర్రాజు మాటలను వక్రీకరిస్తున్న మీడియా?