President of IndiaPresident of India

భారత 15వ రాష్ట్రపతిగా (New President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎన్నికయ్యారు. ద్రౌపదీ ముర్మూ (Droupadi Murmu) మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో దేశమంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు. భారత రాష్ట్రపతిగా (President of India) ఎన్నికయ్యేందుకు కావాల్సిన ఓట్లను ఆమె ఇప్పటికే సాధించారు.

మూడో రౌండ్ ముగిసేసరికి ఆమెకు 2161 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 5, 77, 777. అలానే విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మూడో రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61, 062. ఈ విషయాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ (Rajya Sabha Secretary General) పీసీ మోడీ మీడియాకు (Media) వెల్లడించారు.

ద్రౌపదీ ముర్మూ భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

గిరిపుత్రిక ముర్ముకు అభినందనలు వెల్లువ

ప్రపంచం నలుమూలల నుంచీ ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని, దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) విశ్వాసం వెలిబుచ్చారు. బీజేపీ అధ్యక్షుడు (BJP President) నడ్డాతో (Nadda) కలిసి ముర్ము నివాసానికి వెళ్లి రాష్ట్రపతి విజేత ముర్ముని అభినందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రత్యర్థి సిన్హా (Yashwant Sinha) ప్రకటించారు. ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేస్తారని సిన్హా ఆశాభావం వెలిబుచ్చారు.

నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు నా అభినందనలు, శుభాకాంక్షలు.
– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము సంపాదించిన అనుభవం, అందించిన నిస్వార్థ సేవలు, ప్రజా సమస్యలకు ఆమెకున్న అవగాహన దేశానికి ఉపయోగడపతాయి. ద్రౌపది ముర్ముకు మనస్ఫూర్తి అభినందనలు.
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తదుపరి రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక దేశానికి గర్వకారణం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ముర్ముకు అభినందనలు.
–హోంమంత్రి అమిత్‌ షా మరియు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా

ఎన్నికైన రాష్ట్రపతికి సేనాని అభినందనలు

విజయం సాధించిన గిరిపుత్రిక, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ముకిసేనాని అభినందనలు తెలియచేసారు.

రాజనీతిజ్ఞుడు శ్రీ రాంనాథ్ కోవింద్

రాష్ట్రపతిగా పదవి విరమణ చేయనున్న గౌరవనీయులు రాంనాథ్ కోవింద్ గారి వీడ్కోలు సందర్భంగా ఈ నెల 22 ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్’కి ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆహ్వానించిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోమ్ మరియు సహకార శాఖామాత్యులు అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ జనసేనాని తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.

తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిష్కళంకుడైన రాంనాథ్ కోవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జనసేనాని పదవీ విరమణ చేయబోతున్న రాంనాథ్ కోవింద్’కి అభినందనలు తెలియజేసారు.

కొడాలి నాని నీతులు తరువాత – ముందు గోతులు పూడ్చు!