సీఎం జగన్’కు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ లేఖ
ఆంద్రప్రదేశ్’లో (Andhra Pradesh) కొత్తగా ఏర్పాటు చేసే 26 జిల్లాలకు (New Districts) కొత్తగా ఏర్పాటు చేసే 26 జిల్లాలకు, మహా పురుషులు, త్యాగధనులు పేరులు పెట్టాలని వేల్పూరి శ్రీనివాస్ (Velpuri Srinivas) డిమాండ్ చేశారు. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah), సర్దార్ గౌతు లచ్చన్న (Gouthu Lachanna), మహా కవి గుర్రంజాషువా, ఉద్యమ వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seeta Rama Raju), పేదల ఇళ్లస్థలాలు కోసం ఆమరణనిరాహారదీక్ష చేస్తూ హత్యకు గురైన వంగవీటి మోహన రంగా, గిరిజనుల ఆరాద్యుడు సంత్ సేవాలాల్ నాయక్, కవయిత్రి మొల్ల, శ్రీకృష్ణ దేవరాయలు, ప్రముఖ చేనేత నాయకులు ప్రగడ కోటయ్య, బీసీ నేత కటారి సత్యనారాయణ యాదవ్, అన్నదాత డొక్కా సీతమ్మ, పుల్లరి ఉద్యమ యోధుడు కన్నెగంటి హనుమంతు, జాతీయ జండా రూపశిల్పి పింగళి వెంకయ్య లాంటి మహా నాయకులు పేర్లు పెట్టాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు సీఎం జగన్’కు బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో మొత్తం 225 కులాలు ఉన్నాయని, 220 కులాల చరిత్రను కనుమరుగు చేయాలని పాలకులు అనేక కుట్రలు చేశారు అని వేల్పూరి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు పాలకులు తండ్రి, తాత, ముత్తాత, మామ పేర్లు పెట్టి ప్రజలును అవమాన పరచడమే అని వేల్పూరి పేర్కొన్నారు. ఇలా చేయడం వాళ్ళ రాజ్యాధికారంలో లేని కులాలు అంతం అవుతాయని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన మాట గుర్తు చేశారు.
నేటి పాలకులు విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేస్తూ 220 కులాలును అన్ని విధాలుగా అనచివేశారు అని… రాష్ట్రంలో సామాజికన్యాయంను 75 సంవత్సరంల నుండి నేటి వరకు సమాది చేసారు అని వేల్పూరి గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలుకు సామాజికన్యాయంచేయడానికి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని వేల్పూరి శ్రీనివాసరావు తమ లేఖలో తెలిపారు.