AP Journalist associationsAP Journalist associations

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు అరెస్టు…
అండగా వున్నా వంశీకృష్ణ, కృష్ణాంజనేయులు తదితరులపై కేసులు
ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇది నిదర్శనం
న్యాయమూర్తులను కించపరచినవారిని మాత్రం అరెస్టు చేయరు

పాత్రికేయులు (Journalists) సమాచారం సేకరిస్తారు. ఆ సమాచారాన్ని వార్తా కథనాలుగా ప్రజలకు చేరవేస్తారు. వర్తమాన విషయాలను అందిస్తూ ప్రజాపక్షం వహిస్తారు. వృత్తి నిబద్ధతతో పని చేసే పాత్రికేయులను అరెస్టులు చేసి, కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని వైసీపీ ప్రభుత్వం (YCP Government) భావిస్తున్నట్లుగా ఉంది. సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును (Senior Journalist Kollu Ankababu) అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణిని వెల్లడిస్తోంది. ఆయన్ని అరెస్టు చేయడంలో సుప్రీం కోర్టు (Supreme Court) మార్గదర్శకాలను అనుసరించలేదు అని జనసేన పార్టీ (Janasena Party) ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు.

గన్నవరం విమానాశ్రయంలో (Gannavaram Airport) బంగారం స్మగ్లింగ్ కు (Gold Smuggling) సంబంధించిన సమాచారాన్ని పాత్రికేయులు ఉండే వాట్సాప్ గ్రూపులో (whats up Group) పోస్ట్ చేశారంటూ అంకబాబును అరెస్టు చేసి కుట్రపూరిత నేరం కింద సెక్షన్లు నమోదు చేయడం చూస్తుంటే ప్రభుత్వ ఉలిక్కి పడుతోంది అనిపిస్తోందని జనసేనాని (Janasenani) అన్నారు.

సహచర జర్నలిస్టు అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన జర్నలిస్టు సంఘ నాయకులు మారెళ్ల వంశీకృష్ణ (Marelly Vamsi Krishna), కృష్ణాంజనేయులు (Krishnanjaneyulu) తదితరులపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు (Police Station) తరలించడాన్ని ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వం వైఫల్యాలను తన చర్చల ద్వారా ప్రజలకు వెల్లడించే వంశీకృష్ణ లాంటి పాత్రికేయుల విధానాలు పాలకులకు రుచించడం లేదనే మాట వినిపిస్తోంది. ఇలాంటి అరెస్టులతో అదుపు చేయాలని చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

సామాజిక మాధ్యమాల్లో (Social Media) వ్యక్తిత్వ హననం చేస్తూ, అభ్యంతరకరమైన పోస్టులు చేసే అధికార పక్షంవారిపై సీఐడీ ఎందుకు స్పందించదు. సామాన్యులు, మహిళలు, ప్రతిపక్ష పార్టీల వారిపై వైసీపీ వాళ్ళు చేసే సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ హద్దులు దాటుతున్నా.. ఈ దాడిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోరు.

పోలీసు శాఖ మీన మేషాలు

సామాన్యులే కాదు గౌరవ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, వారి కుటుంబ సభ్యులను సైతం వైసీపీ కార్యకర్తలు, వారి ద్వారా లబ్ధి పొందే వ్యక్తులు ఎంతగా కించపరిచారో ఎవరూ మరచిపోలేదు. హైకోర్టు జోక్యం చేసుకొని ఆ విధమైన పోస్టులు చేసిన వారిని అరెస్టు చేయమని చెప్పినా పోలీసు శాఖ మీన మేషాలు లెక్కించింది. తూతూమంత్రంగా కొందరిని అరెస్టు చేసి మర్యాదలు చేశారు. ఇప్పటికీ కొందరిని అరెస్టు కూడా చేయలేదు అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

గౌరవ న్యాయమూర్తులను కించపరిస్తే స్పందించలేని సీఐడీ (CID) – సీనియర్ పాత్రికేయుడు అంకబాబు షేర్ చేసిన సమాచారానికి ఎందుకు ఇంత తీవ్రంగా వ్యవహరిస్తోంది? ఆయన ఇచ్చిన సమాచారం ప్రభుత్వాన్ని (Jagan Government) ఉలిక్కిపాటుకు గురి చేసిందంటే వాస్తవాలు ఏవో దాగి ఉన్నాయి అనిపిస్తోంది. దీనిపై పాత్రికేయ సంఘాలు (Journalist Associations) ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందించాలి. వాక్ స్వతంత్రాన్ని పరిరక్షించాలి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.

ఘనంగా పోషకాహార మాసోత్సవములు