Mudragada Press meetMudragada Press meet

కాపుల్లో ఐక్యత సాధ్యమేనా

కాపు కాసేవారు (Kapulu) తమ జాతి భవిష్యత్తుని ఆ రెండు పాలక పార్టీలకు తాకట్టు పెడుతున్నారు. జనాభాలో సుమారు ౩౦% ఉండి కూడా రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం పోరాడలేక పోతున్నారు. రాజ్యాధికారం కోసం ఈ నాయకులు ఎందుకు పోరాడలేక పోతున్నారు? పాలక పార్టీలకు ఎందుకు పల్లకీలు మోయడానికి ఇష్టపడుతున్నారు.

కాపు కాసే తమ వర్గాన్ని పచ్చపార్టీకి (Pacha Party) తాకట్టు పెట్టిన  కొద్దిమంది నాయకులు కోట్లకి పడగలెత్తారు? అలానే తమ వర్గాన్ని దొడ్డల నాయకత్వానికి తాకట్టు పెట్టిన మరికొంత మంది కాపు నాయకులు (Kapu Leaders) కూడా కోట్లకి పడగలెత్తారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

పెద్దాయన కాపు కాసే ముద్ర?

కానీ కాపు కాసే పెద్దాయన (Peddayana) చేసిన కుల ఉద్యమాలను నమ్ముకొన్న కాపులు మాత్రం మట్టి కొట్టుకు పోయారు ? కాపులు సమాజంలో నేడు ఏకాకులు అయ్యారు. రిజర్వేషన్ పాయె. రాజ్యాధికారం పాయె అన్న చందాన కాపుల పరిస్థితి ఉన్నది. రెంటికీ చెందని రేవడిలా కాపులు మిగిలి పోయారు. దీనికి కారణం పెద్దాయన చేసిన పక్షపాత వైకిరితో కూడిన ఉద్యమాలే అని యువత నమ్ముతున్నారు.

పోనీ మా పెద్దాయన అయినా బాగు పడ్డాడా అంటే అదీ లేదు. ఆయన ముక్కు సూటి తనం, ఏకాకి ఉద్యమాలు, అక్కరకురాని ఆయన నిజాయితీ ఆయన్ని పాడు చేశాయి. ఆయన నమ్ముకొన్న కులాన్ని నాశనం చేశాయి. ఆయనకున్న కమ్మని ద్వేషం, దొడ్డలపై ఆయనకున్న ప్రేమతో రిజర్వేషన్ ఉద్యమాలను (Kapu Reservations) పక్క దారి పట్టించారు. కుల ఉద్యమాల వల్లే కాపు కాసేవారి పరిస్థితి నేడు అగమ్య గోచరంగా తయారు అయ్యింది. అలానే ఆయన కూడా చితికి పోయారు. ఆయన్ని నమ్ముకున్న కుల సోదరులు (కుల నాయకులు కాదు) కూడా మోస పోయారు. చివరకు కాపు కాసే వారంటే చైనా వస్తువుల కంటే చౌక అన్నంత చులకన భావం సమాజానికి ఏర్పడింది.

వెరసి కుల ఉద్యమాలను భూచిగా చూపి కాపుల్లోంచి వచ్చే చోటా మోటా కుల నాయకులు బడా నాయకులుగా చెలామణి అవుతున్నారు. కంచాలు కొట్టించి గర్జించిన “ముద్ర” అనే సింహం మాత్రం ఒక పాలక వర్గ పక్షపాతిగా ముద్ర వేసికొన్నది. అవును మా సింహం “దొడ్డల” దొడ్డిలోనిదే. అందుకే నేడు సేద తీరుతున్నది అనే అపప్రదని పెద్దాయన మూటగట్టుకున్నాడు.

మెగా కుటుంబ (Mega Brothers) ప్రభావం:

మరొక పక్కన సత్తెకాలపు “చిరంజీవి” (Chiranjeevi) చేసిన అవగాహన రహిత, అహంకార పూరిత రాజకీయాల వల్ల కాపు కాసేవారి ఆశలు మరింత దిగజారాయి. ఇది నిజం కూడాను.

ఇంకొక పక్కన అణగారిన వర్గాల్లో ఉన్న కుల నాయకులను, పాలక వర్గాలు తమ తమ పెరట్లో కట్టేసికొంటున్నారు అని యువత నమ్ముతున్నది. కాపుకాసే వారితో పల్లకీలు మోపించు కొంటున్నారు. కానీ అణగారిన వర్గాలు మాత్రం పాలకులు వేసే తాయిలాల కోసం కొట్టుకు చస్తున్నారు. కానీ తమ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేక పోతున్నారు అని యువత ఆక్రోశిస్తున్నది.

మా కుల పెద్దలు ఈ కుల ఉద్యమాలు నేటి వరకు ఎవరి కోసం చేశారు? ఇప్పటి వరకు కాపులు ఏమి సాధించారు? ఈన గాసి నక్కల పాలు అన్నట్లు కాపు ఉద్యమ ఫలితాలు మాత్రం పాలకులకే ఉపయోగపడుతున్నాయి? కమ్మని దొడ్డలను పదవుల్లో కూర్చోపెట్టదానికి లేదా దింపడానికి మాత్రమే వీరి ఉద్యమాలు పనికి వస్తున్నాయా అని తెలిసికోలేక పోతున్నారు.

మా తాతలు నేతిలు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు వీరు ఉంటున్నారు. అలానే మా తాతలు రాజ్యాలు ఏలారు కానీ మేము మాత్రం ఎప్పటికీ పల్లకీలు మోస్తునే ఉంటాము అన్నట్లు వీరు ఉంటున్నారు. వీరిలో వీరే కొట్టుకు చస్తున్నారు. పాలక వర్గాల పంచన చేరుతున్నారు అంటూ యువత ఆందోళన చెందుతున్నది.

మాకు రివేర్వేషన్ వద్దు రాజ్యాధికారం కావాలి!

మాకు రివేర్వేషన్ వద్దు రాజ్యాధికారం కావాలి అని వీరు అనలేరు. అలా అని ఈ ప్రభుత్వాలు మాకు రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు అని కూడా ప్రశ్నించలేరు. కాపు కార్పొరేషన్ లేకపోతే మాకు పెన్షన్, ఆసరా లాంటి పథకాలు ఇచ్చేవారు కాదా? ఇస్తే కుల కార్పొరేషన్’లో ఎందుకు వేస్తున్నారు? అని అడిగే మగాడే కాపు కాసేవారిలో ఉన్నట్లు కనపడదు అని యువత భావిస్తున్నది. మరొక పక్కన పాలకులను అడగాల్సిన వీరు, ముద్ర, చిరు గాలి, పవనాలు అంటూ ఒకరి కొకరు తిట్టుకు చస్తున్నారు. పాలకుల పల్లకీల మోతకు పోటీలు పడుతున్నారు.

మరొక పక్కన పవనాలపై పెట్టుకొంటున్న ఆశలు మాత్రం అడుగట్టుతున్నాయి. తన నాలుగు గోడలు దాటి, తన చుట్టూ ఉన్న ఆ నలుగురిని దాటుకొని పవనాలు మాత్రం అణగారిన వర్గాల కోసం వచ్చే సూచనలు రోజు రోజుకీ సన్నగిల్లుతున్నాయి. పురిటి సంధిని దాని పవనాల పార్టీ ఎదగలేక పోతున్నది అని అణగారిన వర్గాలు నిరాశ చెందుతున్నారు.

పాలకులు మాత్రం తమ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ఒక పాల వర్గంపై మరొక పాలక వర్గం బహిరంగంగా పోరాడు కొంటుంటే, అణగారిన వర్గాలు మాత్రం మౌనం వహిస్తున్నారు. అధికార ఫలాలను అనుభవిస్తున్న మీరే పోట్లాడుకొంటుంటే, ఏ అధికారం దక్కని మా అణగారిన వర్గాల మాటేమిటి? అధికార ఫలాల్లో మాకు రావాలిన వాటా మాటేమిటి? అని ప్రశ్నించలేక పోతున్నారు.

కాపు కాసే ఈ నాయకుల్లో మార్పు వచ్చేదెప్పుడో?

అధికార ఫలాల్లో రావాల్సిన వాటా కోసం వీరు అంతా కలిసి పోరాడేది ఎప్పుడో? అయినా “గాదెలు నిండిన కుల నాయకులు అనే ఈ తోడేళ్ళు” ప్రాభల్యం నడుస్తున్న ఈ రోజుల్లో కాపు కాస్తూ పల్లకీలు మోసేవారిలో మార్పు వస్తుంది అంటారా? వీరు అంతా పవనాలకు మద్దతు నిచ్చి రాజ్యాధికారం సాధించుకో గలరా? కళ్యాణ్ బాబు కూడా ఆ నలుగురిని దాటుకొని, నాలుగు గోడలను దాటుకొని బయటికి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడ గలడా?

మీలో ఎవ్వరి మనస్సులను అయినా నొప్పించి ఉంటే, పెద్ద మనస్సుతో నన్ను మన్నించండి. ఈ కధనం తప్పు అనిపిస్తే వాస్తవాలను యువతకి తెలియ చేయండి. లేకపోతే ఒక్కసారి ఆలోచించండి.

Spread the love
One thought on “మత్తు వదిలి రాజ్యాధికారం కోసం పోరాడేది ఎప్పుడు?”

Comments are closed.