Jagan video conferenceJagan video conference

104 కి ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ వివరాలు

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసిన గంటలోపు  కరోనా బెడ్ వివరాలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ప్రజలను అప్రమత్తం చేశారు. కరోనాతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ప్రజలకు సూచించారు. వచ్చే జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తున్నది అని అన్నారు. స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసికొంటున్న చర్యలను తెలిసికొన్నారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై వారికి తగు చూచనలు కూడా చేశారు.

104 కి ఫోన్ చేయగానే బెడ్ వివరాలు అరగంటలో చెప్పాలని సూచించారు. ఆరోగ్య శ్రీ కింద కోవిడ్’కు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రము మనదేనని చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉండాలని సూచించారు. హోమ్ ఐసొలేషన్’లో ఉన్నవారికి కిట్లు అందకపోతే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, ఎస్పీలు తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్ 2 న ఆరోఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతామని సీఎం చెప్పారు. అక్టోబర్ 5 న విద్యా కానుక కొంద విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తామని సీఎం తెలియ చేశారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల పునః ప్రారంభాన్ని నవంబర్ 2 కి వాయిదా వేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు