Nadendla Manohar Press meet on VarahiNadendla Manohar Press meet on Varahi

అన్నవరం సత్యదేవుడి దర్శనం అనంతరం శ్రీకారం
జూన్ 14 నుంచి వారాహి యాత్ర
కత్తిపూడి కూడలిలో వారాహి నుంచి తొలి బహిరంగ సభ
ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభ
రాజకీయాల్లో పెనుమార్పునకు నాంది
ప్రజలతో మమేకమై, వారి బాధలు.. కష్టాలు తెలుసుకునేలా యాత్ర
పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్

ఎప్పుడు ఎప్పడు అని ఎదురుచూస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) అన్నవరం (Annavaram) నుండి మొదలు కాబోతున్నది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం. ఇది ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం. ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మంగళగిరి పార్టీ ఆఫీసులో (Mangalagiri Party Office) కీలక ప్రకటన చేసారు.

మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. అన్నవరం సత్యదేవుడి దర్శనం చేసుకుని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం అని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోంది.

ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నాం. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలు అవుతుంది. పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది జనసేనాని వారాహి యాత్ర ఉంటుంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్ మ్యాప్’ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. ప్రతి నియోజక వర్గంలో వారాహి నుంచి ప్రజలని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

వినతులు స్వీకరిస్తూ… క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ…

ప్రజల సమస్యలు వింటూ, వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ సేనాని వారాహి యాత్ర సాగేలా ప్రణాళిక ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతారు. అనంతరం పార్టీ నాయకులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఉంటుంది. ఆయా నియోజవర్గాల్లోని కార్మిక, రైతు వర్గాలు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, డ్వాక్రా మహిళలు, స్థానికంగా ఉండే అన్ని వర్గాలవారితోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముందుకు వెళతారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

స్థానిక సమస్యల పరిస్కారంపై హామీ

స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, పరిశీలించి వాటిపై మాట్లాడుతారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, పాలకుల కళ్లు తెరిపించేలా, సమస్యకు పరిష్కారం చూపేలా గళమెత్తుతారు. కచ్చితంగా వచ్చే జనసేన ప్రభుత్వంలో సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో కూడా ప్రజలకు భరోసానిస్తారు. ప్రతి నియోజకవర్గాన్ని సమస్య రహితంగా తీర్చిదిద్దేలా యాత్రలో ప్రత్యేక కార్యచరణను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో వారాహి యాత్ర చారిత్రాత్మక యాత్రగా నిలిచిపోనుంది అని నాదెండ్ల అన్నారు.

ప్రతి నియోజక వర్గంలో జనవాణి

పొత్తులలో భాగంగా ఖరారు అయిన యాత్ర కాదిది… అన్నీ నియోజకవర్గాల్లోనూ వారాహి యాత్ర ఉండాలనేది పవన్ కళ్యాణ్ అభిమతం. ఈ యాత్ర ఎన్నికల కోసమో, పొత్తులో ఖరారైన నియోజక వర్గాల్లోనో సాగే యాత్ర కాదు. అన్ని నియోజక వర్గాల్లో సమస్యలను, ప్రజలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, కలుసుకునేందుకు చేస్తున్న యాత్ర. ప్రతి నియోజక వర్గంలో జనవాణి కార్యక్రమం ఉంటుంది. ప్రతి రోజూ ప్రజల నుంచి అర్జీలను స్వయంగా పవన్ కళ్యాణ్ స్వీకరించి, వాటిని పరిశీలించి, పోరాట ప్రణాళికను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తారు.

పోలీసులకు జనసేన పార్టీ ఎల్లపుడూ సహకరిస్తుంది. వారంటే పవన్ కళ్యాణ్’కి గౌరవం. వారు కూడా మాకు యాత్రలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

అంతకు ముందు యాత్ర ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, కనకరాజు సూరి, చేగొండి సూర్యప్రకాష్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అధికార సాధనే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు