రాజ్యాంగం (Constitution) మార్చాలి అంటూ తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ అంతటా దుమారం లేపుతున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ కెసిఆర్ చేసిన ప్రకటపై విరుచుకు పడుతున్నాయి. ఇది అణగారిన వర్గాలపై జరుగుతున్న కుట్రగా పలువురు అభివర్ణిస్తున్నారు.
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రవీణ్ ప్రకాష్
సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కెసిఆర్ మాట్లాడడం దురదృష్టకరమని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ అన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ (BSP) ఆధ్వర్యంలో బుధవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ (Ambedkar) విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలియ చేశారు. అనంతరం ఆయన మీడియాతో (Media) మాట్లాడారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగం ఏర్పడింది. కేసీఆర్ తన ఆస్తులు, కమీషన్లను పెంచుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారా అని ప్రవీణ్ఆ ప్రకాష్ ఆరోపించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అయన అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ ముందుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం గురించి ఒక్క మాట మాట్లాడినా ప్రజలు కేసీఆర్ నాలుక కోస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న బీజేపీ (BJP) ఆలోచననే కేసీఆర్ ప్రతిపాదించారు. విలేకరుల సమావేశానికి మందు కలిపిన కల్లు తాగి వచ్చి మతి లేకుండా మాట్లాడినట్లు కనిపించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని మార్చాలా?: కిషన్‌రెడ్డి
భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించడం మంచిది కాదని కిషన్ రెడ్డి సూచించారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకత్వంపై, కేంద్రంపై కేసీఆర్ అడ్డగోలు భాషను ప్రయోగించడం మంచిది కాదని ఆరోపించారు. కెసిఆర్’లో అభద్రతాభావం స్పష్టంగా కనిపించిందని, బీజేపీని విమర్శించే ముందు ఆయన ఇచ్చిన హామీలను ఎంతమేరకు నెరవేర్చారో కెసిఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కెసిఆర్ వ్యాఖ్యలు సరికాదు: మందకృష్ణ మాదిగ
భారతదేశానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అవసరం లేదని… కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు దేశానికీ సరికాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు.
ఏ రాజ్యాంగం కావాలి?: ఈటెల
భారత రాజ్యాంగం మార్చాలంటున్న కేసీఆర్‌కు (KCR) దాని స్థానంలో కల్వకుంట్ల రాజ్యాంగం (Kalvakuntla Rajyangam), రాచరిక పాలన కావాలా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajendra) ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తీసేయాలంటూ మాట్లాడిన కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారు అని ఈటెల అన్నారు. రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు అంబేడ్కర్ కల్పించారని ఈటెల పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనిస్టు పార్టీలతో (Communist parties) సహా అన్ని పార్టీలు సంఘాలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి. ఇది అణగారిన వర్గాలపై (Suppressed classes) జరుగుతున్న కుట్రగా పలువురు అభివర్ణించారు.