కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు
పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)
మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. భారతదేశానికి (India) అసలైన స్వాతంత్య్రం 2014లో మాత్రమే వచ్చింది. 1947లో వచ్చింది కేవలం భిక్షేనని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) పెద్దయెత్తున ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భాజపా (BJP) ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) సహా పలువురు రాజకీయ నేతలూ (Political Leaders) ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డును (Padma sree Award) కంగన స్వీకరించారు. బుధవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌కు 1947లో వచ్చింది స్వాతంత్య్రం (Independence) కానే కాదు. అది భిక్ష. మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో (మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు)’’ అని ఆమె అన్నారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
‘‘మహాత్మా గాంధీ (Mahatma Gandhi) త్యాగాలను కంగన గతంలో అవమానించారు. ఆయన్ను కాల్చిచంపిన వ్యక్తిని కీర్తించారు. ఇప్పుడేమో సమరయోధుల త్యాగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అని వరుణ్ గాంధీ కంగన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు.
కంగనా క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్
స్వాతంత్య్రంపై కంగన తాజా వ్యాఖ్యలు దేశద్రోహం పరిధిలోకే వస్తాయని కాంగ్రెస్ (Congress) తెలిపింది. కంగనాకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి అయిన గౌరవ్ వల్లభ్ దిల్లీలో (Delhi) గురువారం విలేకర్లతో మాట్లాడారు. కంగన దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల అని డిమాండ్ చేశారు.