Pawan Janavani 1Pawan Janavani 1

ముద్దుల మామయ్య మధ్యలోనే వదిలేసాడు
విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్.. విదేశీ విద్యాదీవెనలో వంచన
అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది
స్పందన కార్యక్రమం విజయవంతం కాలేదు
అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి?
ప్రతి సమస్యను అధ్యయనం చేసి పరిస్కారం
రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొడదాం
రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి
క్రిమినల్స్ కు వంత పాడుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు
‘జనవాణి’ మొదటివారం ముగింపు సమావేశంలో పవన్ కళ్యాణ్

‘నేను మీ మావయ్యను.. ఏది ఒకసారి మామయ్య అనండి…’ అంటూ ముద్దులు పెట్టి మరీ మన ముఖ్యమంత్రి (Chief Minister) పిల్లలకు మాయమాటలు చెబుతున్నారు. కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) విషయంలో వారిని నిలువునా మోసం చేశారని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. విద్యార్థుల చదువు మధ్యలో ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్ములు ఇవ్వకుండా ఎందుకు దోబూచులాట ఆడుతున్నారు? అని పవన్ ప్రశ్నించారు.

‘బాగా చదువుకోమని మాటలు చెబుతున్న మావయ్య చేతల్లో మాత్రం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? మామయ్య డబ్బులు వేస్తాడు.. తమ చదువులు పూర్తవుతాయి అని నమ్మి విదేశీ విద్యకు (Foreign Study) వెళ్లిన విద్యార్థులు మధ్యలో ప్రభుత్వం ఉపకార వేతనం (Stipend) వేయకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను మావయ్య పట్టించుకోడా?’ అని జనసేనాని (Janasenani) నిలదీశారు. బీటెక్ చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఫీజు రీ ఎంబర్స్మెంట్ సొమ్ములు ప్రభుత్వం వేయకపోవడంతో.. కళాశాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న విషాద సంఘటనకు ఈ ముద్దుల మామయ్య ఏం సమాధానం చెబుతారని పవన్ ప్రశ్నించారు.

జనసేన పార్టీ (Janasena Party) ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపునయ్య ఆడిటోరియంలో చేపట్టిన ‘జనవాణి’ (Janasena Janavani) మొదటి వారం కార్యక్రమం ముగింపు సందర్భంగా జనసేనాని (Janasenani) జగన్ ప్రభుత్వంపై (Jagan Government) విరుచుకు పడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ “ప్రతి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం (Spandana Program) విజయవంతం అయితే, మా వద్దకు అసలు సమస్యలు ఏవి రాకుండా ఉండాలి కదా..! మొదటివారమే మొత్తం 427 మంది తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారంటే అర్థం ఏమిటి..? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇది చెబుతున్నట్లే కదా? 427 అర్జీలతో వచ్చినవారు బాధలతో, సమస్యలతో సతమతం అవుతున్న లక్షల మందికి ప్రతినిధులు వారు. మన ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలపై తప్ప అన్ని విషయాల్లోనూ తీరిక ఉంటుంది. పుట్టిన రోజు సంబరాలకు, సదస్సులకు, బూతులు తిట్టడానికి వారికి చాలా సమయం ఉంటుంది. ప్రజా సమస్యలను తీర్చడానికి వారికి ఏమాత్రం తీరిక ఉండదు. మనం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తాం అని జనసేనాని ఎద్దేవా చేసారు.

• వారిది ఓట్ల ఆరాటం….. మాది మంచి కోసం చేసే పోరాటం

ఒకరికి మేలు చేయాలన్నా, ఒక సమస్యను పరిష్కరించాలన్నా వైసీపీ నాయకులు ఎన్ని ఓట్లు పడతాయి..? వారితో మనకి లాభం ఎంత అని ఆలోచిస్తారు. జనసేన మాత్రం ఒక సమస్యను పరిష్కరిస్తే ఎంత మందికి మంచి జరుగుతుంది అని మాత్రమే కొలమానంగా తీసుకుంటుంది.

ఏదైనా ఒక సమస్య కోసం గళమెత్తితే ఆయా వర్గాల ఓట్లు ఎన్ని పోతాయో.. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు. ఒక సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఓట్ల రాజకీయాన్ని నేను ఆలోచించను. కేవలం ప్రజలకు మేలు జరిగితే నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా విజయం సాధించినట్లే భావిస్తాను అని పవన్ అన్నారు.

• కీలకమైన సమస్యలు నా దృష్టికి వచ్చాయి

వచ్చిన అర్జీల్లో (Petitions) ఎక్కువగా వ్యవసాయం మీద, గృహ నిర్మాణం మీద, విద్య మీద వచ్చాయి. సరైన గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక రైతులు అల్లాడుతున్నారు. టిడ్కో ఇళ్ళు ఇవ్వడానికి సైతం ప్రభుత్వానికి మనసు రావడం లేదు. లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించిన పేదలు దీని వల్ల చాలా ఇబ్బందులుపడుతున్నారు. శాంతిభద్రతల సమస్య దారుణంగా ఉంది. ఏదైనా విషయం మీద నిలదీసినా, ప్రజాప్రతినిధులను ప్రశ్నించినా ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తున్నారు.

పోలీస్ కేసులు (Police Cases) పెట్టి కక్ష సాధిస్తున్నారు. బంగారు భవిత ఉన్న విద్యార్థుల మీద కూడా ఇష్టానుసారం పోలీస్ కేసులు పెట్టి బెదిరించడం దారుణం. దీంతో యువత కూడా ఏదైనా ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదు. ఎస్సీ (SC), ఎస్టీ (ST) చట్టాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా, గురజాల నియోజకవర్గం, బ్రాహ్మణపల్లి లో సరస్వతీ పవర్ అండ్ మినరల్స్ కంపెనీ కోసం 300 ఎకరాల భూమి తీసుకొని తర్వాత వారికి కనీసం ఉపాధి కల్పించకుండా పరిహారం ఇవ్వకుండా వైసీపీ  నాయకులు (YCP Leaders) ఇబ్బందులుపెడుతున్నారు. చాలా ప్రాంతాల నుంచి మంచి నీరు బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయి.

మైలవరం, జగ్గయ్యపేట, కైకలూరు లాంటి ప్రాంతాల్లో కూడా మంచినీటి నమూనాలను ప్రజలు తీసుకువచ్చి మరీ చూపించడం బాధించింది. లక్షల కోట్లు డబ్బులు దాచుకోవడం.. దోచుకోవడం తప్ప, కనీసం ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం శోచనీయం అని జనసేనాని విమర్శించారు.

• అంతా బ్లాక్ మెయిలింగ్… బెదిరింపులు

ఈ ప్రభుత్వం కాపులకు (Kapu) విపరీతమైన ద్రోహం చేస్తోంది. కాపులు ఎదురు తిరిగితే కాపు కార్పొరేషన్’కు (Kapu Corporation) వచ్చే నిధులు ఆపేస్తామని బెదిరింపులు చేస్తున్నారు. అలాగే ముస్లిం వర్గాలకు చెందిన పథకాలను నిలుపుదల చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ (SC ST Sub Plan) నిధులు మళ్లించడమే కాదు.. వారి సంక్షేమానికి ఉద్దేశించిన 27 పథకాలను రద్దు చేశారు. దళితులు మావైపే అని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం (YCP Government) వారిని వంచన చేస్తోంది. దీనిపై ఎస్సీ మేధావులు ఆలోచించాలి. అలాగే ఆటో డ్రైవర్లకు 10,000 డబ్బులు ఇచ్చి, వివిధ చలాన్ల రూపంలో అంత కంటే ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభువని దుయ్యబట్టారు.

• బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు గుర్తుంచుకుందాం

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Ambedkar) చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలి. ‘పేదలపై మీ ప్రేమలు, అభిమానాలు వద్దు. వారి కోసం ఉద్దేశించిన, వారి హక్కులకు సంబంధించిన చట్టాలను, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయండి చాలు’ అన్న మాటలు నేటి పాలకులు గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి. మీ ముద్దులు, అక్కున చేర్చుకోవడాలు వద్దు. ప్రజల సమస్యలు తీర్చండి. పదేపదే ముద్దులు పెట్టుకొనేవాళ్లను నమ్మోద్దు. మన పొరుగున ఉన్న శ్రీలంక (Srilanka) పరిస్థితికి కారణం అక్కడ వనరులు లోపం కాదు. నాయకత్వ లోపం. మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిస్థితి కూడా అలాగే ఉంది.

పూర్తి స్థాయి వనరులు ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నదానిపైనే దృష్టి పెడుతుంది తప్ప.. ప్రజా సమస్యలు తీర్చడానికి కాదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎలా ఇబ్బంది పెట్టాలి? ఓటర్లను తిమ్మిని బమ్మి చేసి మన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న కాంక్ష తప్ప, ఏ ప్రజా ప్రయోజనం ఈ ప్రభుత్వానికి లేదు అని జనసేనాని తెలిపారు.

• అద్భుతాలు చేస్తానని చెప్పను

నాకు ఒక అర్జీ ఇవ్వగానే అది పరిష్కారం అవుతుందని చాలామంది అనుకుంటారు. అది ప్రజలకు నాపై ఉన్న నమ్మకం. నేను వెంటనే అద్భుతాలు చేసేస్తాను.. అన్ని పరిష్కరిస్తాను అని చెప్పడం లేదు. కచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలను పదిమంది దృష్టికి తీసుకు వెళ్లేలా ప్రయత్నిస్తాను. ఆ సమస్య విస్తృతం అయ్యేలా చూస్తాను. దీనివల్ల ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీంతోపాటు అధికారులు కచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక ఫాలో అప్ ఉంటుంది. ఆ ప్రక్రియను విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు (Janasena Leaders) వర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం.

ఒక బాధ్యతతో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యేలా మాత్రం చూస్తాం. వైసీపీ నాయకులు పూర్తిగా క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ రోజు వచ్చిన ఓ అర్జీలో ఐదేళ్ల బిడ్డ జీవితం పాడు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడిపై ఇప్పటివరకు కనీస కేసు పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కనీసం ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడం మరీ విచిత్రం.

క్రిమినల్స్ ను వేనకేసుకొస్తున్న ఈ పాలకులను చూస్తే మనకు ఎందుకు కోపం రావడం లేదు. మనలో ధైర్యం లేక గూండాలకు, దగాకోరులకు భయపడుతున్నారా? ఈ పద్ధతిని కచ్చితంగా జనసేన బ్రేక్ చేస్తుంది. మేం అధికారంలోకి వస్తే బలంగా లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తామని హామీ ఇస్తున్నా. తప్పు చేసిన వాడి తోలు తీసేలా శాంతిభద్రతలు ఉంటాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

• ఈ రాక్షస పాలన (Raksasa Palana) నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ హానికరం అన్నమాట నేను ఎప్పుడో చెప్పాను. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. దీని నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి. బలమైన భావజాల సమూహం ఉన్న నాయకులంతా కలిస్తేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్’కు పునర్వైభవం వస్తుంది. జనసేన నాయకులకు చెప్పేది ఒక్కటే సమస్యల్లో ఉన్న ప్రజల కోసం నిలబడండి. కచ్చితంగా మనకు ఓటు అడిగే హక్కు వస్తుంది. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేసుకొని వెళ్లడానికి అంతా సిద్ధమై ఉందాం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

కులసంఘ అధిపతులారా! ఇంతకీ మన రేటు ఎంత?