Pithapuram municipalityPithapuram municipality

పారిశుధ్య కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari) పిఠాపురంలో (Pitapuram) గత ముడు రోజులుగా మున్సిపల్ కార్మికులు (Municipal Employees) నిరవధిక సమ్మె చేస్తుస్తున్నారు. మునిసిపల్ పారిశుధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు (Strike) మద్దతుగా పిఠాపురం మున్సిపాలిటీలో (Municipality) కూడా సమ్మె చేస్తున్నారు.

అందులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏఐటీయూసీ (AITUC) నాయకులు సాకా రామకృష్ణ అధ్యక్షన చేబట్టి న 3వ రోజు సమ్మెకు మద్దతు గా జనసేన పార్టీ (Janasena Party) పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సంఘీభావం తెయజేస్తు కార్మికులతో మమేకం అయ్యారు. కార్మికులు వర్షం అనిచూడకుండా సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల ను చూసి శేషుకుమారి చలించిపోయారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమండ్లను ఏపీ ప్రభుత్వం (AP Government) ఖచ్చితంగా తీర్చవలసి ఉందని శేషు కుమారి (Makineedi Sheshu Kumari) అన్నారు.

పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే పరిసరాలు శుభ్రంగా ఉండవని కరోనాలాంటి భయంకరమైన వైరస్’లు కొలువుతీరతాయి అని ఆమె అన్నారు. ఒక పక్కన కరోనా (Carona) మహమ్మారి పొంచి ఉన్నది. మరొక పక్కన పారిశుధ్య కార్మికుల సమ్మెతే ఎక్కడ చుసిన చెత్తా చెదరమే.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ఇలాంటి పరిస్థిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించకపోతే పారిశుద్ధ్యం పడకేస్తుంది. వారు అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్దంగా ఉన్నాయి. సమానంగా పనిచేయించుకొనే ప్రభుత్వం సమానవేతం ఇవ్వాలి. పాదయాత్రలో పర్మింట్ చేస్తాం అనే హామీని నేడు నెరవేర్చాలి. పెండింగ్ లోఉన్న హెల్త్ అలెవెన్స్ (Health allowance) తక్షణమే ఇవ్వాలి. సీపీఎస్ (CPS) రద్దు చేస్తానని ముక్తి కంఠంతో అన్న మాట నిలబెట్టు కోవాలి. ఆప్కోస్’లో రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement benefits) మరియు వారి పిల్లల కు ఉద్యోగం ఇవ్వాలి. కార్మికుడు కోరే డిమాండ్లు మాట తప్పకుండా మడం తిప్పకుండా నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కార్మికులకు న్యాయం చేసి తన చిత్త శుద్ధిని నిరోపించుకోవాలని మాకినీడి శేషు కుమారి కోరారు.

ఈ కార్యక్రమంలో పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, మాజీ కౌన్సిలర్ వేణు నారాయణరావు, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, గంగిరెడ్ల సూరిబాబు, యండ్రపు శ్రీనివాసు, మాదేపల్లి పద్మరాజు, కంద సోమరాజు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, కొనమచిలి దుర్గాప్రసాద్, రాజు, స్వామి, రాజేష్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

అజ్ఞానంతో విమర్శలు కాదు నిరూపించే దమ్ము ఉందా: నాదెండ్ల