Nadendla at KakinadaNadendla at Kakinada

మనసులేని ముఖ్యమంత్రిని సాగనంపాలి
గతంలో ప్రజలు బాధలు వినేందుకు సీఎంలు ప్రత్యేక సమయం ఇచ్చేవారు
ఈ సీఎం ఇంటి నుంచి బయటకు రావడమే గగనం
ప్రజా సమస్యలు వినే జనవాణి అడ్డుకుంటున్నారు
ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత మనం తీసుకుందాం
కాకినాడలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం స్పందించని పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన కూతురికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన దశలో ముఖ్యమంత్రి సహాయం చేస్తారని, ఎంతో ఆశతో వచ్చిన మహిళ తన పట్ల సీఎంతోపాటు అధికారులు చూపిన నిర్ధయను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూస్తే మీ మానవత్వం ఎంతో అర్ధమవుతుంది. మీ పాలన నైజం బయట డింది. మనసు లేని ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఒక్కటే అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం పదవి వుండీ వృథా’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలో శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

“గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్రంలోని ప్రజలంతా కార్యాలయానికి వచ్చే వెసులుబాటు ఉండేది. కచ్చితంగా ముఖ్యమంత్రి ఉదయం వేళల్లో సందర్శకులు కలిసి వారి సమస్యలు విని అవసరమైన వారికి సహాయం చేసేలా ఏర్పాట్లు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా లేదు. తన కన్న కూతుర్ని రక్షించుకోవడానికి కాకినాడకు చెందిన ఓ ఆడపడుచు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగారు. అలాగే సచివాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారి చెందారు. చివరకు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే మీ పాలన డొల్లతనం ఏంటో అర్ధం అవుతుంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ముఖ్యమంత్రి ఎంత అసమర్ధుడో తెలుస్తుంది. మానవత్వం లేని ప్రభుత్వం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే. మనిషికి మనిషి సహాయ పడలేని వ్యక్తులు పదవుల్లో ఉండటం ప్రజల దౌర్భాగ్యం. ఈ ముఖ్యమంత్రికి పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైంది. మీ కార్యాలయాలు చుట్టూ తిరిగే వారిని పట్టించుకోరు. కానీ కొత్త కొత్త కార్యక్రమాలు అంటూ ప్రకటనల ఖర్చులు వృధా చేస్తున్నారు. బిడ్డను రక్షించుకోవాలని తపన పడిన ఆడపడుచు ఆవేదన చూస్తే కనీసం ముఖ్యమంత్రి మనసు కరగకపోవడం ఆయన స్వరూపాన్ని బయటపెడుతుంది. భారీ బడ్జెట్లు, సంక్షేమం అని మీరు లెక్కలు చెబుతున్నా, ఒక సగటు తల్లికి సహాయ పడలేని మన వ్యవస్థ లు పూర్తిగా ఓడిపోయినట్లే అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

మీరు వినరు… మమ్మల్ని అడ్డుకుంటారు

ప్రజలు బాధలు, వేదనలు వినే ఓపిక తీరిక ఈ ముఖ్యమంత్రి కి ఎలాగూ లేదు. జనసేన పార్టీ ద్వారా జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలుసుకుందామని మేం భావిస్తే, దానిని అడ్డుకునేందుకు రకరకాల కుట్రలు చేస్తారు. ఆపదలో ఉన్న వారు, దివ్యాంగులు అలాగే కష్టాల కడలిలో ఉన్న వారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్’కి తమ బాధలు చెప్పుకొని స్వాంతన పొందుతున్నారు. వారికి జనసేన పార్టీ తరఫున వీలైనంత సాయం అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అడ్డుకోవడానికి విశాఖపట్నంలో చేసిన కుట్రలు అందరికీ తెలుసు. కనీసం ప్రజల సమస్యలు వినేందుకు మీకు ఎలాగూ మనసు లేదు. కనీసం మమ్మల్ని అయినా వారి సమస్యలు వినకుండా చేస్తున్నారు. ఇదేనా మీరు చేసే అద్భుతమైన పాలన..? అంటూ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్ల విషయంలో చేయబోయే ఆడిట్’లో ప్రజలు ఇళ్ల విషయంలో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం. రాష్ట్రంలోనే అతి పెద్దదిగా కాకినాడ లే అవుట్ ఉంది. ఇక్కడ పనులు ఏవి జరగటం లేదు. నియోజక వర్గాల వారీగా నాయకులు జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల బాబు, మేడా గురుదత్ ప్రసాద్, వేగుళ్ల లీలా కృష్ణ, బండారు శ్రీనివాసరావు, మరెడ్డి శ్రీనివాస్, సంగిసెట్టి అశోక్, శ్రీమతి పోలాసపల్లి సరోజ, శ్రీమతి జయలక్ష్మి, మేడిసెట్టి సూర్యకిరణ్, సత్య తలాటం, సిరంగు శ్రీను తదితరులు ఉన్నారు.

ప్రతి కార్యకర్తనూ కుటుంబ సభ్యుడిగా భావించే పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన సభ్యుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రమాద బీమా చెక్కులను ఈ సందర్భంగా మనోహర్ అందజేశారు. కత్తిపూడికి చెందిన రైతు జీలకర్ర కృష్ణ జనసేన పార్టీలో క్రియా శీలకంగా పని చేసేవారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో పార్టీ తరఫున రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అమలాపురం నియోజకవర్గం పేరూరుకు చెందిన పిల్ల శ్రీనివాస్ తాపీ మేస్త్రి గా పని చేస్తూనే జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కు బాధిత కుటుంబానికి అందజేసి ధైర్యం చెప్పారు.

అలాగే కాకినాడ నగరంలోని 22వ డివిజన్ కు చెందిన వంతపాటి శ్రీనివాసరావు పార్టీలో క్రియాశీలక సభ్యులు. కూలి పనులు చేసుకునే శ్రీనివాసరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కును మనోహర్ వారి ఇంటికి వెళ్లి బాధితులకు అందజేశారు. ఆయన భార్య శ్రీమతి నాగదుర్గకు చెక్కును అందజేసి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా ఉండి వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి మెడి క్లైమ్ చెక్కులను మనోహర్ అందజేశారు.

ఇది ఆట కాదు పవనేశ్వరా! మాహా విద్వంశం!

Spread the love