Nadendla Manohar Press meetNadendla Manohar Press meet

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో కుట్ర
ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలి
ఇటువంటి ప్రచారాలు మీడియాకు ఎవరి ద్వారా వెళ్లాయో?
ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జన సైనికులకు తెలుసు
జనసైనికులు, వీర మహిళలు కుట్రలను తిప్పికొట్టాలి
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీపై (Janasena Party) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government), వైసీపీ (YCP) కొత్త కుట్ర మొదలుపెట్టిందని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని జనసేన పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది… ప్రజాస్వామ్య పద్ధతుల మీద జనసేనకు అపార గౌరవం ఉంది. జన సైనికులు, వీర మహిళలు వ్యవస్థలు, వ్యక్తుల మీద దాడులు చేసే సంప్రదాయానికి పూర్తి దూరం. ఏ ప్రజా పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. అలాంటి జనసేన పార్టీపై కుట్ర మొదలు పెట్టడం దారుణం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

13 మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందంటూ… పోలీసు ఇంటిలిజెన్స్ నివేదిక (Intelligence Report) అంటూ సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు. దీని ద్వారా కొత్త కుట్రల ప్రచారం మొదలు పెట్టారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘శనివారం సాయంత్రం నుంచి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పోలీసు ఇంటిలెజెన్స్ హెచ్చరికల పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 13 మంది వైసీపీ ప్రజాప్రతినిధుల మీద జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేస్తాయని హెచ్చరించినట్లు ప్రచారం మొదలైంది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఒక వేళ రాష్ట్ర పోలీసు శాఖ (Police Department) జారీ చేసిన ఉత్తర్వులు నిజమే అయితే కచ్చితంగా డీజీపీ (DGP) దీనిపై చర్యలు తీసుకోవాలి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఇంటిలిజెన్స్ ఉత్తర్వులు ఎలా మీడియాకు వెళ్లాయో దర్యాప్తు చేయాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు.

పాలకుల కుట్రలు పారలేదు

మా ఫోన్లు, మా మీద నిఘా పెట్టడం మాని ఈ రహస్య అంశాలు ఎలా బయటకు వెళ్తున్నాయో డీజీపీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి ద్వారా ఈ ప్రచారాలు బయటకు వెళ్తున్నాయో మాకు సమాచారం ఉంది. రోజురోజుకీ జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న జనాదరణ చూసి అసూయ చెందుతున్న అధికార పక్షం ఇలాంటి కుట్రలకు తెర లేపుతోందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ర్యాలీలో ఏకంగా డీసీపీని పవన్ కళ్యాణ్ వాహనంపైకి ఇక్కారు. అలా చేయడం ద్వారా ఎలాగోలా రెచ్చగొట్టాలని, గొడవలు సృష్టించాలని ప్రభుత్వం చూసింది. అది సాధ్యం కాకపోవడంతో కొత్త కుట్రలకు తెరలేపింది. అలజడి, అపోహలు, అయోమయం, అనుమానాలు ప్రజల్లో సృష్టించి దీని ద్వారా గొడవలు సృష్టించాలని ప్రభుత్వం చూస్తున్నది. ఇది జనసేన పార్టీ మీద నెట్టేయాలన్నదే ఈ పాలకుల ఉద్దేశ్యం. వారి కుట్రలు పారలేదు. టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినా ఇప్పటి వరకు ఆ కేసులో ప్రభుత్వం పురోగతి సాధించలేదు. అందుకే ఈ ప్రభుత్వం, కొత్త కుట్రలు మొదలుపెట్టిందనే విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలి అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

రండి ఎన్నికల ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం

వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య బద్ధంగా తేల్చుకునేందుకు జనసేన సిద్ధంగా ఉంది. జనసేన పార్టీనా… వైసీపీనా అన్నది ప్రజలే తేలుస్తారు. ప్రజలు ఎవర్ని ఆదిరిస్తారో, ఎవరి వైపు నిలబడతారో తేలుతుంది. జనసేన పార్టీ మీద మీరు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు రోజుకు 200 గడపలు తిరుగుతున్నారు. అదీ కూడా ముందుగానే ఆయా ప్రాంతాల వాలంటీర్లు ప్రజలకు సమాచారం ఇచ్చి, జాగ్రత్తలు చెప్పిన తర్వాతే ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. మరి దీనిలో కూడా దాడులు జరుగుతాయి అని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటీ..?

జన సైనికులెవరూ ప్రజా సమస్యలపై ఎప్పుడూ శాంతియుతంగా, ప్రజాస్వామికంగా పోరాడుతారు తప్పితే, ఎప్పడూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పిన గీత దాటరు. నాయకుడు నేర్పిన క్రమశిక్షణ తప్పక పాటిస్తారు. వైసీపీ వారి కుట్రలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజా పోరాటాలను కచ్చితంగా జనసేన పార్టీ చేస్తుంది. వాటిని ఎక్కడా అప్రజాస్వామిక పద్ధతుల్లో మాత్రం చేయదు. ప్రభుత్వ కుట్రలను జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు బలంగా తిప్పికొట్టాలి’’ అని నాదెండ్ల మనోహర్ కోరారు.

అక్రమ అరెస్టులతో జనసేనను అడ్డుకోగలరా?
ధ్వజమెత్తిన ఉత్తరాంధ్ర జనసేన నాయకులు