ధర్మో రక్షతి రక్షితః
దేవుని ఆస్తులను (assets of God) అమ్మేద్దాం అనే వ్యక్తులను గాని ప్రభుత్వాలను గాని ఓటరు దేవుడు రక్షించవచ్చు. కానీ ఆ పైన ఉన్న దేవుడు (god) భక్షించి తీరుతాడు.
దేవుని దర్శనానికి ఛార్టర్డ్ ఫ్లైట్స్’లో వెళ్లే వారు ఉన్నారు. అలానే జోగి దండుకుని దేవుని దర్శనానికి వెళుతున్న వారు ఇప్పటికీ కూడా కోకొల్లలు. జోగి దండుకోవడం అనేది తమ మొక్కులు తీర్చు కోవడం కోసం అవ్వచ్చు లేదా దైవ దర్శనానికి కావాల్సిన పైసలు లేకపోయి కూడా అవ్వచ్చు. ఎంతో నమ్మకంతో దేవుని సన్నిధికి చేరడానికి భక్తులు నిత్యం పాటు పడుతుంటారు. అది వారి వారి నమ్మకం. తమ తమ కష్టాలను ఆ దేవుడు తీరుస్తాడు అనే నమ్మకమే వారితో అలా చేపిస్తుంది. దేవుడిపై భక్తులకున్న ఆ నమ్మకాన్ని వీధుల్లో వేలం పాట పెడతాము అని కొన్ని ప్రభుత్వాలు అంటున్నాయి. దీన్ని ఏ భక్తుడు కూడా జీర్ణించుకోలేక పోవచ్చు.
సైన్స్ కి అందని శక్తే దేవుడు అని అందరూ నేటికీ నమ్ముతారు. అది ఏ మతమైనా కావచ్చు. దేవుడు ఎవరైనా కావచ్చు. అన్ని మతాలు చెప్పే ధర్మం ఒక్కటే. అటువంటి ధర్మాన్ని రక్షించండి. ఆ ధర్మమే మిమ్ములను, మీ మీ కష్టాల నుండి రక్షిస్తుంది. లేకపోతే మిమ్ములను భక్షించి తీరుతుంది. మీరు ఎంత ఆస్థిపరులైన, లేదా ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా మీ ప్రభుత్వాలను, మిమ్ములను ఆ దేవుడు భక్షించి తీరుతాడు.
అయితే ప్రభుత్వాలతో సహకరించ వలసిన అవసరం మన అందరికీ ఉంది. అలానే భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, పాలకులకు, ప్రజా ప్రతినిధులకు కూడా ఉంది. భాద్యతలు మరిచి హక్కులకోసం మాత్రమే పోరాడినవాడి పతనం తప్పదు.
నమ్మకాలతో కూడిన భక్తుల ఆవేదనని పాలకుల మరియు ప్రజా ప్రతినిధుల అర్థం చేసికోకుండా వేలం పాటలు పెడితే జరగబోయే దేవుని తీర్పులు చాలా భయంకరంగా ఉండవచ్చు.
ఏ ప్రభుత్వాన్ని గాని, రాజకీయనాయకుడిని గాని, మరొక వ్యవస్థని గాని లేదా మరొకరిని గాని భాధిస్థే మన్నించండి. లేక మిమ్ములను ఆలోచింపచేస్తే, అప్పుడు భక్తుల నమ్మకాలను గౌరవించడానికి ప్రయత్నించండి. అదే మీకు మాకు మన అందరకు శ్రీ రామరక్ష. సర్వజగద్రక్ష. లేకపోతే గత చరిత్ర పాఠాలను తిరగేస్తే జరగబోయేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయంలో గుట్టలు, పుట్టలు నేర్పిన చరిత్ర పాఠాలు మరచిపోకూడదు.
ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అనేది మనిషి నమ్మకం. వారి నమ్మకాలను వీధుల్లో వేలం పాట పెడతాము అని ఎవరైనా అనుకుంటే అది అధర్మమే కావచ్చు. అధర్మమే వారిని, వారి అధికార మదాన్ని భక్షించి తీరుతుంది. ఇవే కాలగతి చెబుతున్న అక్షర సత్యాలు.
AP High Court Judgement on AP State Election commission
మీ Akshara Satyam