Damodaram SanjeevaiahDamodaram Sanjeevaiah

తొలి తాళిత ముఖ్యమంత్రి జయంతి స్పెషల్
సమతావాది సంజీవయ్య
దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య

దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) ముఖ్యమంత్రిగా (Chief Minister) పని చేసినది రెండేళ్లు మాత్రమే(1960…1962) . ఇది స్వల్పకాలమే. అయినా దామోదరం అంటే అనేక అభ్యుదయ కార్యక్రమాలను అమలుపరిచిన ప్రగతిశీలి అని చెప్పక తప్పదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి నిబద్దమైన నేత అని అంగీకరించక తప్పదు. దామోధరం సంజీవయ్య లాంటి దార్శనిక నేత నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు కేంద్ర బిoదువు కావలిసిన అవసరమున్నది.

ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటే

దళితనేత (Dalit Leader) దామోదరం సంజీవయ్య గారు 1960 జనవరి 11 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన వయసు కేవలం 38 సంవత్సరాలే. అప్పటికే మంత్రిగా ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నారు. ఆ నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నీలం సంజీవరెడ్డి (Neelam Sanjeeva Reddy), అల్లూరి సత్యనారాయణరాజు (Alluri Satyanarayana Raju) వర్గాలుగా చీలిపోయింది.

అప్పట్లో నీలం సంజీవిరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ప్రధాని నెహ్రు అప్పుడే సంజీవరెడ్డిని (Sanjeeva Reddy) ఎ.ఐ.సీ.సీ. అధ్యక్షుడిగా ఎంపిక చేసారు. అప్పటికే అనేక మార్గాలలో ఆరితేరిన అల్లూరి సత్యనారాయణరాజు ముఖ్యమంత్రి పదవిని కాంక్షించి పోటీకి సిద్ధమయ్యారు. సంజీవరెడ్డి తన వారసుడిగా కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రతిపాదించారు.1955 ఆంధ్ర శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టులను మట్టి కరిపించిన వ్యక్తిగా, పి.సి.సి అధ్యక్షుడిగా అల్లూరి సత్యనారాయణరాజు జాతీయ నాయకుల ఆదరాభిమానాలను పొంది ఉన్నారు.

ఇందిరాగాంధీ ఏ.ఐ.సి.సి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక, అల్లూరి సత్యనారాయణ రాజుని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు.

ముఖ్యమంత్రి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఆ పదవిని అల్లూరి సత్యనారాయణ రాజు కోరుకోవడం సహజం. దీంతో అల్లూరి సత్యనారాయణ రాజుకు, సంజీవరెడ్డి మధ్య స్పర్థులు బాగా పెరిగాయి. అల్లూరి సత్యనారాయణ రాజుని ముఖ్యమంత్రిని కానివ్వకూడదని సంజీవ రెడ్డి పట్టుపట్టారు.

వ్యూహ రచనలో ఆరి తేరిన అల్లూరి సత్యనారాయణ రాజు, దామోదరం సంజీవయ్యను తెరపైకి తెచ్చారు. దేనితో సంజీవరెడ్డి ఏంచేయ లేక పోయారు.అధిష్ఠానం సైతం సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని బలపర్చడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి

సంజీవయ్య ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం రెండు అంటే (1960…1962) రెండేళ్లు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆయనను నటి సమాజం అంగీకరించ లేదు. అధికారంలో ఉన్నది స్వల్పకాలమే అయినప్పటికీ అనేక అభ్యుదయ కార్య క్రమాలను ఆయన చేపట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం శ్రీ కాకుళం జిల్లాలో వంశదార ప్రాజెక్ట్’కు (Vamsadhara Project) అయన శంకుస్థాపన చేశారు. నేడు శ్రీకాకుళం జిల్లాలోని వoశదార, సువర్ణముఖి, నాగావళి, వేదవతి నదీజలాలు సాగురైతుల పొలాల్లో ప్రవహించి పంటలు బాగా పండుతున్నాయి.

పరిశ్రమలకు నీటి వసతి సమకూరింది. రాయలసీమలోని అలనాటి గాజులదిన్నే ప్రాజెక్ట్’కు (Gajuladinne Project) శంకుస్థాపన చేసింది కూడా సంజీవయ్య.ఈ ప్రాజెక్ట్ నేడు సంజీవయ్య సాగర్ గా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కోడుమూరు, డోన్, ప్రత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు,నీటి వసతి సమకూరింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఆ రోజుల్లో ఏమి జరిగింది అంటే?

సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనంటే గిట్టనివారు ప్రధాని నెహ్రూకి అనేక ఫిర్యాదులు చేశారు. నిజనిజాలను తేల్చేందుకు నెహ్రు అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పర్మార్ ను పంపించారు. ఆయన హైద్రాబాద్ నుండి కర్నూలు చేరుకుని సంజీవయ్య స్వగ్రామమైన పెదపాడును సందర్శించారు. ఆయనతో పాటు నాటి యువ నేత చక్రపాణి (తదనoతర కాలంలో ఆంద్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్’గా కూడా పనిచేశారు) కూడా వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ పూరింటి ముందు ఆగింది. దాన్ని చూసి ఇక్కడేందుకు ఆపారు. మనం వెళ్లాలిచింది సంజీవయ్య ఇంటికి కదా అని పర్మార్ అడిగారట. అప్పుడు చక్రపాణి ఇదే సంజీవయ్య ఇల్లు అని చెప్పడంతో పర్మార్ ఆశ్చర్యపోయారు అంటా.

ఇంట్లోకి వెళ్లి చూస్తే వృద్ధురాలైన సంజీవయ్య తల్లి సుంకులమ్మ కట్టెలపొయ్యి దగ్గర వంట చేస్తూ కనిపించారు. ఆ దృశ్యం చూసి పర్మార్ చలించిపోయి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారట. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు మూడు దశాబ్దాలుపాటు ఎన్నో పదవులు సంజీవయ్య నిర్వహించారు. అన్ని పదవులు నిర్వహించినప్పటికీ సంజీవయ్యకు చనిపోయే నాటికి ఉన్నది ఒక పాత పియేట్ కారు,17000 రూపాయలు బ్యాంక్ బ్యాలన్స్ మాత్రమే అంటారు. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగమానదు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య. కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీ ని అర్థం చేసుకోవచ్చు. నేటి పాలకులు ఈ నిజాలు తెలుసుకొని… సంజీవయ్యను ఆదర్శంగా తీసికోవాలి అని చెప్పడం కాదేమో.

చివరగా ఒక్క మాట!

నేటి కుల సంకుచితత్వాల కాలుష్య వాతావరణంలో దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు సంజీవయ్యను విస్మరించడం చాలా బాధాకరం. దామోదరం సంజీవయ్య ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్దిమంది రాజకీయనాయకుల్లో అయన ఒకరని నేటితరానికి తెలియచెప్పాలిసిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని ఆలస్యంగా నైనా గుర్తించడం ముదావహం.

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో దామోదరం సంజీవయ్య కోసం ఒక స్మృతివనం (హైద్రాబాద్’లో మాదిరిగా) ఏర్పాటు చేసి తీరాలి. దామోదరం సంజీవయ్య లాంటి ఒక దార్శినిక దళితనేత నేడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు కేంద్రబిoదువు కావలిసిన అవసరమున్నది అని చెప్పడం అతిశయోక్తి కాదేమో?

Source: Social Media

కేంద్రంపై నిప్పులు చెరిగిన నిప్పులు చెరిగిన కేసీఆర్‌ !
పార్టీలు ఏకమై బీజేపీని తరిమి కొట్టాలి

Spread the love