vinutha kotavinutha kota

చిందేపల్లి గ్రామ రోడ్డును ఆక్రమించిన ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వినుత కోటా (Vinutha Kota) ఆ గ్రామస్థులతో కలిసి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష (Indefinite fasting) కొనసాగుతున్నది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది.

శ్రీకాళహస్తి (Srikalahasti) నియోజకవర్గం, ఏర్పేడు మండలం, చిందే పల్లి గ్రామానికి వెళ్ళే R&B రోడ్డును లాంకో ఈసీఈఎల్ (LANCO/ECL ) ఫ్యాక్టరీ యాజమాన్యం మూసివేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరకి సమస్య తీసుకుని వెళ్ళినా ఎవరు స్పందించలేదు.

శాంతి యుతంగా గ్రామస్థులతో కలిసి వినుత కోటానిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు గ్రామస్తులను, జనసేన నాయుకులను అక్రమం గా అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతూ , గ్రామస్థులపై లాఠీ ఛార్జ్ చేస్తూ బయబ్రంతులకు గురిచేస్తున్నారు.

ఈరోజు గ్రామస్థులతో కలిసి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఏర్పేడు మండలం, చిందేపల్లి గ్రామంలోని శివాలయం నందు రాజ్యంగబద్దంగా , శాంతి యుతంగా నిరాహార దీక్షమొదలు పెట్టారు. ఈ నిరాహార దీక్ష చిందే పల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డుపై కట్టిన అక్రమ గోడను తొలగించేవరకు కొనసాగుతుందని వినుత కోటా ఒక ప్రకటన తెలిపారు. వినుత కోటాతో పాటు గ్రామస్థులు, మహిళలు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.

మురిగిపోతున్న నిధులంటూ జగన్ ప్రభుత్వంపై జనసేనాని కార్టూన్