AP High courtAP High court

క్రింది కోర్టుకి వెళ్ళండి అని సూచన

నర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) వేసిన బెయిల్ పిటిష‌న్‌ను ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) కొట్టేసింది. విచార‌ణ జ‌రిపిన‌ ఉన్న‌త న్యాయ‌స్థానం వాద‌న‌లు పూర్తి అవ‌డంతో, బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని ర‌ఘు రామ‌ రాజుకు సూచించింది. ఎంపీని సీఐడీ కోర్టులో (CID Court) హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌ను ఆదేశించింది. హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని చుసించింది. అందుచేత ఎంపీని సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అద‌న‌పు కోర్టులో ర‌ఘురామ‌ను హాజ‌రు ప‌ర‌చ‌ నునున్నట్లు తెలుస్తున్నది.

తనపై సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న‌రాత్రి హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ (House motion Petition) దాఖలు చేశారు. ర‌ఘురామ త‌ర‌ఫున సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ఆదినారాయ‌ణ రావు వాద‌న‌లు వినిపించారు. ప్రాథ‌మిక విచార‌ణ లేకుండా ఎంపీ అరెస్టును న్యాయ‌వాది త‌ప్పు బట్టినట్లు తెలుస్తున్నది. ర‌ఘురామ అరెస్టుకు స‌హేతుక కార‌ణాలు లేవ‌ని కోర్టుకు వివ‌రించారు. జిల్లా కోర్టును దీనిపై ఎందుకు ఆశ్ర‌యించ‌లేద‌ని న్యాయ‌వాదిని హైకోర్టు న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. కేసు తీవ్ర‌త దృష్ట్యా హైకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని కోర్టుకు ఆయన తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభియోగాల‌తో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.