Pothina mahesh press meetPothina mahesh press meet

కోనసీమ అల్లర్లు (Konaseema Incidents) అనంతరం,కోనసీమలో కులాల ఐక్యత (Unity in various castes) మొదలు అయ్యింది. కోనసీమ అల్లర్లు యాదృచ్చికంగా జరిగినవి కాదని, రాజకీయ లబ్ది కోసం వైసీపీ (YCP) గీసిన మాస్టర్ ప్లాన్’లో (Master Plan) భాగంగా జరిగినవేనని జనసేన పార్టీ  (Janasena Party)  ప్రధాన కార్యదర్శి  పెదపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. కోనసీమలో ఏర్పడిన ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది అని అన్నారు. కాపు (Kapu), శెట్టిబలిజలతో (Setty balija) పాటు ఎస్సీ (SC), ఎస్టీలు (ST), మైనారిటీలు ఒక రాజకీయ సమూహంగా జనసేన (Janasena) వైపు మొగ్గుచూపడాన్ని అధికార పార్టీ జీర్ణించు కోలేక పోతోందని అన్నారు.

ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో అన్నదమ్ముల్లా ఉండే కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ నాయకులు (YCP Leaders) పన్నిన కుట్రను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జగన్ రెడ్డి (Jagan Reddy) రాజకీయలబ్ది కోసం ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టించారనీ, వారి రాజకీయాల కోసం ఎస్సీలు, బీసీలనే బలిచేశారని అయన మండిపడ్డారు. ఘటనపై ఇంత వరకు ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేకపోవడం ప్రభుత్వం దీన్ని ఎంత తేలిగ్గా తీసుకుందన్న విషయం అర్ధమవుతోందన్నారు.

కులాల కార్చిచ్చులో విరుచుకుపడ్డ జనసేన

ఆదివారం విజయవాడలో పార్టీ అధికార ప్రతినిధులు  పోతిన వెంకట మహేష్, డాక్టర్ గౌతంరాజ్,  విజయ్ శేఖర్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు వైసీపీ నుంచి రోజు రోజుకీ దూరమవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో దళితుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం.. గొప్పగా పరిపాలిస్తాం.. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారు. దళితుల్ని దగా చేశారు.

ఇలాంటి పరిస్థితులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయేలా చేశాయి. కోనసీమ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు ఆది నుంచి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. అంతా చదువుకుని ఒక నిర్ధిష్టమైన ఆలోచనా విధానంతో మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులు చక్కగా అర్ధం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. శ్రీ జగన్ రెడ్డి చేసిన కుట్రల్ని వారంతా అర్ధం చేసుకున్నారు. వైసీపీకి, శ్రీ జగన్ రెడ్డికి వారంతా దూరంగా జరుగుతున్న పరిస్థితుల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి వారిని విచ్చిన్నం చేయాలన్న ఆలోచనతో కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించారు.

జగన్ రెడ్డి పాలనలో దళితులకు ఒరిగిందేమీ లేదు

వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద హత్యాచారాలు, దాడులు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. డాక్టర్ సుధాకర్ ఉదంతం నుంచి చీరాల ఎడిచర్ల కిరణ్ హత్య కేసు, సీతానగరం శిరోముండనం కేసు, గుంటూరు రమ్య హత్య కేసు, రేపల్లి దళిత మహిళ సామూహిక అత్యాచారం, కొద్ది రోజుల క్రితం సాక్ష్యాత్తు వైసీపీ ఎమ్మెల్యే శ్రీ అనంతబాబు ఒక దళిత యువకుడ్ని హత్య చేసి తన కారులోనే వేసుకుని తల్లి దండ్రులకు అప్పచెప్పిన పరిస్థితి. ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితుల్లో శ్రీ జగన్ రెడ్డి వల్ల దళితులకు ఒరిగిందేమీ లేకపోగా వారి కుట్ర, మోసాలకు బలి చేస్తున్నారని అర్ధం అయ్యింది. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారన్న విషయం దళిత యువత తెలుసుకుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం ఉన్న అనేక పథకాల్ని నాశనం చేసింది. విద్యోన్నతి పథకం, విదేశీ విద్యోన్నతి పథకం, బెస్ట్ ఎవాలిబుల్ స్కీమ్ పథకం, ల్యాండ్ పర్చేజింగ్ పథకం, ఇళ్ల పట్టాలు ఆశ చూపి ఎస్సీ, ఎస్టీల ఆదీనంలో ఉన్న అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడింది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉన్న స్కీములను మెమో నంబర్ 1214 / 2020 ద్వారా రద్దు చేయడం జరిగింది. వైసీపీ మోసపూరిత వైఖరి దళిత యువతకు అర్ధం అవుతోంది అని జనసేన తీవ్రంగా ఆరోపించింది.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదిగింది

ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అన్ని వెనుకబడిన వర్గాలు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో వారంతా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. కోనసీమలో ఈ కులాలన్నీ జనసేన పార్టీ వైపు చూస్తుండడంతో శ్రీ జగన్ రెడ్డికి ఈర్ష్య మొదలైంది. ఎలాగైనా అక్కడ విధ్వంసం సృష్టించి, కులాల మధ్య చిచ్చు పెడితే వారు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ కలవకుండా ఉండేలా చేస్తేనే జనసేన బలహీనపడుతుందన్న కుట్ర పూరిత వైఖరితోనే కోనసీమ ప్రాంతంలో అల్లర్లు సృష్టించారు అని జనసేన పార్టీ దుయ్యబట్టింది.

గొడవను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది

కులాల్ని కలిపే ఆలోచనా విధానం జనసేన ప్రధాన సిద్ధాంతం. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య ఆరోగ్యకమైన వాతావరణంతో శ్రీ పవన్ కళ్యాణ్ నికార్సయిన రాజకీయాలు చేస్తున్నారు. కోనసీమ ప్రాంతంలలో ప్రజలంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో నివసించాలని జనసేన పార్టీ కోరుకుంటోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు గుండెల నిండా నింపుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్. దళిత యువత కోసం ఒక నిబద్దతతో కూడిన ప్రణాళిక ఉన్న ఏకైక నాయకుడు ఆయన. అన్నిజిల్లాలతో పాటు కోనసీమకు బాబాసాహెబ్ పేరు పెట్టవచ్చు కదా? ఇప్పుడే ఎందుకు పెట్టారు. ఇదంతా వైసీపీ మాస్టర్ ప్లాన్’లో భాగం. కులాల మధ్య అలజడి సృష్టించాలి. కులాలు కలసి ఉండకూడదు. రాష్ట్రంలో ఏ రెండు కులాలు కలిసినా వైసీపీ పీఠాలు కదిలిపోయే పరిస్థితులు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మహనీయుని పేరుని వివాదాలకు కేంద్రంగా వాడుకునే పరిస్థితుల్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకుంది. డీజీపీ (DGP) స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు గొడవ జరిగిన ప్రాంతాన్ని సందర్శించలేదు. అల్లర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసుల్ని పంపారు.

మీరు ఎన్ని కుట్రలు చేసినా, అరాచకాలు సృష్టించినా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్’కీ ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో నానాటికీ పెరుగుతున్న ఆదరణ తగ్గించలేరు. మీరు ఇంటికి పోయే సమయం ఆసన్నమైంది. కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని కుంపటి చేయొద్దు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. నేరాలు, ఘోరాలు చేసి విధ్వంసాలు సృష్టించి వాటిని జనసేనకు ఆపాదించే ప్రతయ్నం చేస్తే చూస్తూ ఊరికునేది లేదు. ప్రజాక్షేత్రంలో మీకు బుద్ది చెబుతాం అని జనసేన పార్టీ దుయ్యబట్టింది.

జనసేన పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా (Ambedkar Konaseema District) వద్దని ఎక్కడా చెప్పలేదు. మా పార్టీ నాయకులు ఆ పేరు కోసం నిరసన దీక్షలు కూడా చేశారు. ఉద్రిక్తతల నేపధ్యంలో సున్నితమైన అంశాన్ని ప్రజల మధ్య సానుకూల పరిస్థితులు కల్పించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి గుర్తు చేశారని అయన అన్నారు.

సీఎం, డీజీపీ ఎందుకు స్పందించలేదు – పోతిన వెంకట మహేష్

పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. కోనసీమ అల్లర్ల ఘటన మీద దామోస్ పర్యటనలో ఉన్న  జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా వీడియో సందేశం పంపితే రాష్ట్రంలో శాంతి భద్రతలను (Law and order) కాపాడగలిగే వారు. నియంత్రించగలిగే వారు.  జగన్ రెడ్డి (Jagan Reddy) ఆ ప్రయత్నం చేయకపోవడాన్ని ఆ పార్టీ కుట్రగానే భావిస్తున్నాం. కోనసీమలో అల్లర్లు సృష్టించి తద్వారా ఆ ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టి అత్యధిక సీట్లు సాధించాలన్న రాజకీయ కుట్ర దాగి ఉండబట్టే ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇంతపెద్ద ఘటన జరిగితే కనీసం డీజీపీ కూడా స్పందించలేదు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పలేదు. ఈ ఘటన మొత్తానికి సూత్రదారులు, పాత్రదారులు వైసీపీ పార్టీ పెద్దలే అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వైసీపీ కుట్రల్ని ప్రజలు గ్రహించాలి. మొదట మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అమరావతి రాజధాని పేరిట కులాల మధ్య చిచ్చుపెట్టారు. దానికి కొనసాగింపే కోనసీమ ఘటన. శ్రీ జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించకుంటే ప్రజాస్వామ్య వాదులంతా తిరగబడతారు. మీకు చిత్తశుద్ది ఉంటే సామాజిక న్యాయభేరి యాత్రను అమలాపురం ఎందుకు మళ్లించలేదు. ఉద్రికత్తతలు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేదు. పదే పదే తిరుమల (Tirumala) వెళ్లి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ క్షేత్ర పవిత్రతను అపవిత్రం చేస్తున్న మంత్రి శ్రీమతి రోజా (Roja) హిందువులకు క్షమాపణలు చెప్పాలి అని జనసేన పార్టీ (Janasena Party) డిమాండ్ చేసింది.

చెద పడుతున్న కాపుల చరిత్ర
దొడ్ల పెరట్లో కాపు సామ్రాజ్యాలు