PK and NadendlaPK and Nadendla

జనసేనానిపై సామాన్యుని మనోగతం

కౌలురైతు దళితుడా, బీసీనా, లేక మన రెడ్డోడా. కాపోడు అయితే అర్హుడు కాదు. అయినా వీడు మన పార్టీ వాడేనా. పరిహారం ఇస్తే మన పెరట్లే మన బూట్లకి సాష్టాంగ నమస్కారం చేస్తాడా లేదా అని భావించి నష్ట పరిహారాన్ని పరిహాసంగా చేసే ప్రభుత్వాలున్న ఈ రోజుల్లో…

ఓ జనసేనాని! నువ్వెంటి అన్నా మొన్న అనంతపురంలో సుమ్మారు 33 మందికి 33 లక్షలు, నిన్న ఏలూరులో సుమారు 34 మందికి 34 లక్షల రూపాయిలు సాయంగా ఇచ్చావు. రేపు ఒక్కరోజే 131 మంది కౌలు రైతులకు (Kaulu Rythu) సాయం చేసేస్తున్నావు. అదీకూడా నీ సొంత డబ్బులను, కోట్లకు కోట్ల రూపాయిలను దాచుకోకుండా ప్రజలకు పంచేస్తున్నావు. నువ్వు మనిషివి కాదు మహాను భావుడివి. నువ్వు చేసే దానాలు చూసి కాదు. నువ్వు చేసే దౌర్జన్యాలు చూసి ఓట్లే వేసే రోజులు ఇవి అని నీకు తెలిసి కూడా నీ సంపదని కరిగించుకొంటూ పోతున్నావు. కౌలు రైతు కుటుంబాలను ఆదుకొంటూ పోతున్నావు. నువ్వు దేవుడివే.

ప్రజల సొమ్ముని ప్రజలకే భిక్షమేస్తూ పాలకుల పేర్లు పెట్టుకొంటున్న రోజులివి. కానీ పేరు కోసం చెయ్యవు. కులంతో, మతంతో సంబంధం లేకుండా సాయం చేసికొంటూ పోతున్నావు. కానీ ఓటు వేయమని అడగవు.

ఆబ్బె పవన్ (Pawan Kalyan) పనికి రాడు. మంచిని చూసి ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయి అనే చేతకాని వాడిలో కూడా ఆలోచనను రేకేస్తిస్తున్నావు. మార్పు అంటే ఏమిటో చేసి చూపిస్తున్నావు. నువ్వు దేవుడివే.

అయినా నీ మంచితనం తెలిసికోకుండా దోపిడీదారులను మాత్రమే గెలిపిస్తూ నన్ను నేనే నాశనం చేసికొంటున్న అమాయకుడిని. గుడిచేటి కుల నాయకులను నమ్ముతూ నా బిడ్డల భవితను నేనే చిదిమేసికొంటున్న ద్రోహిని. నువ్వు దేవుడివే. అయితే…

ప్రజలను ఆదుకొంటున్నావు సరే మరి పార్టీ మాటేమిటి?

మనిషి జన్మ ఎత్తినందులకు నీలాంటి వాడి వెనుక నడవాలని ఉంది. కానీ నీ అజ్ఞానపు కోటరీ (Kotari) నన్ను నీ వెంట నడవనిస్తారా? నీ కోసం ప్రచారం చేయాలనీ ఉంది. బాత్రూములో నాకు గుండెపోటులు రాకుండా నా ప్రచారాన్ని కొనసాగనిస్తారా?

నీకు ఓటు వేద్దాం అని ఉంది. గెలిపించాలి అని ఉంది. “నాకు ఓటు వేసి పవన్ అనే నన్ను ముఖ్యమంత్రిని (Chief Minister) చేయండి” అని నువ్వు అడగ గలవా? అలానే నీ మనుసులు మా పిరికితనానికి అండగా బూత్ స్థాయిలో నిలబడగలరా? నువ్వు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే చచ్చుబడ్డ నీ మనుషులను దీనికి సమాయత్తం చేయగలవా? బూత్ స్థాయికి పంపగలవా?

మా ఆశల సౌధానివి అయిన పవను అన్నను మా భుజాలపైన మోయాలని ఉంది. కానీ నీ భజాలపైన ఆ పచ్చోళ్ళు ఉన్నారు. వాళ్ళని నువ్వు మోస్తున్నావు అనే “దోపిడీ పిచ్చోళ్ల ప్రచారాన్ని” తట్టుకోలేకపోతున్నాం. దీన్ని నీ కోటరీ తిప్పిగొట్టగలదా?

ఆలోచించండి… నువ్వు దేవుడివే. కానీ మార్పుకి కావాల్సింది తంత్రాలు. తరతరాలుగా ప్రజలను బిక్షగాళ్లగా చేసి పాలిస్తున్న వారిని తరిమి కొట్టాలంటే ఎన్నికలయుద్ధమే శరణ్యం. దానికి నువ్వు సిద్ధమా? (Its from Akshara Satyam)

గురువు గారు – “సరి రారు మీకెవ్వరు”
దాసరి జన్మదినాన్ని స్మరించుకొంటూ

Spread the love