Janasenani with Amit ShahJanasenani with Amit Shah

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ అంశాలతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంపై పవన్ కళ్యాణ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షా గారితో జరిగిన చర్చలు దోహదపడతాయి అన్నారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ ని కూడా కిలిసి పలు విషయాలు చర్చించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతం కావడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

జనసేనలో ఊహించని మార్పులు-సేనాని చర్యలు ఊహాతీతం

Spread the love