బుధవారం అనంతపురంలో జరిగిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీరిలీజ్ వేడుక (Chiru GodFather movie Pre release event) గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అభిమానుల కేరింతల మధ్య, రాజకీయ విశ్లేషకుల నిరీక్షణల మధ్య, రాజకీయ పార్టీల భయాందోళన మధ్య గాడ్ ఫాదర్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ అద్భుతంగా జరిగింది.
నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు అంటూ చిరంజీవి (Chiranjeevi) చేసిన ట్వీట్ (tweet)పెను దుమారం లేపింది. రాజకీయ పార్టీలకు, వారి డబ్బా మీడియాకి (Telugu Media) కంటిమీద కునుకు లేకుండా చేసింది. చిరు (Megastar Chiranjeevi) సృష్టించిన ప్రకంపనలు ఓ కొద్దీ రోజులపాటు చర్చోపచర్చలు జరిగేటట్లు చేసింది.
ఇప్పుడు దానికి దీటైన డైలాగ్’ని గాడ్‌ఫాదర్ (GodFather) ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కేరింతల మధ్య చిరంజీవి చెప్పి ఉర్రూతలూగించారు.
‘రోడ్డు, ఇసుక, కొండలు, నీళ్లు, నేల. మధ్యం కాంట్రాక్ట్‌లు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కరు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచీ మీ ఊపిరి.. మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందించాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడనిది జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబడ్దార్ అన్న డైలాగ్‌ను చిరంజీవి చెప్పి మెప్పించారు. రాజకీయ పార్టీలకు బీపీలు పెంచేశారు అని చెప్పాలి. సెటైరికల్‌గా ఉన్న ఈ రెండో డైలాగ్‌పై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఈ డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో (Anantapur) అంగరంగ వైభవంగా జరిగింది. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ విన్నారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వినిపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులంతా నన్ను గాడ్ ఫాదర్ అని అంటున్నారు. కానీ ఏ గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. అటువంటి నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క అభిమాని నాకు గాడ్‌ఫాదర్. చిరంజీవి వెనక ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేరని అంటుంటారు. ఇప్పుడు చెబుతున్నా.. నా వెనకాల లక్షలాది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు. అభిమానులంతా నాకు గాడ్‌ఫాదర్సే. ఇది నా హృదయం నుంచి వచ్చిన మాట అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
మోహన్‌రాజా (Mohan Raja) దర్శకత్వంలో రూపొందిన ఈ గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే నెల 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గాడ్ గాడ్ ఫాదర్ సినిమాతో చిరు మరోసారి రాజకీయాలలో పెనుప్రకంపనలు సృష్టించబోతున్నాడు అనే అంచనాల మధ్య గాడ్ ఫాదర్ రాబోతున్నది.