Bhumi ubbindhiBhumi ubbindhi

భూమి అలా ఉబ్బింది ఏమిటి అబ్బా? అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతున్నది. ఇటీవల హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వాగులో ఉన్న నీటిలోంచి భూమి ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. ఏదో తాయత్తు మహిమ అన్నట్లు, మంత్ర బలం అన్నట్లు… భూమి ఒక మీటరు పైకి వచ్చింది. అలా నీటిలోంచి భూమి బయటకు ఉబికి రావటం చూసి అక్కడి జనాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భూమిలోపల ఉండే టెక్టోనిక్‌ ప్లేట్‌ కదలికల వల్లే భూమి అలా ఉబికి పైకి వచ్చింది. టెక్టోనిక్‌ వల్ల కాదు! భూమిలోపల ఉన్న మిథేన్‌ తడి పొరల్లోంచి బుడగలాగా పైకి వచ్చింది. వీడియో తీస్తున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ ప్రాణాలు పోతాయి. ‘నిజంగా ఏదో సినిమాలో చూసినట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం పూర్తిగా తెలియ రాలేదు.

పాలకుల దుర్నీతిని ఎండగట్టండి-జనసేనని ఎన్నుకోండి: జనసేనాని