Chiru and RajinaChiru and Rajina

ఉర్రూతలూగిస్తున్న ఆచార్య పాటలు-చిరు డాన్సులు

సానా కష్టం వచ్చిందే మందాకినీ.. అంటిచకే అందాల అగరొత్తిని.. నాన్నయ్య తీయించేయ్‌ నర దిష్టిని’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని ఆచార్య (Acharya) టీం సోమవారం విడుదల చేశారు. మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్‌ (Konidala Productions), మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Matinee entertainment) సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ (Ram Charan) సిద్ధాగా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇందులో చిరు (Chiru) సరసన రెజీనా (Rejena) కసాండ్రా కలిసి నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను రేవంత్‌, గీతామాధురి ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియెగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాజల్‌, పూజా హెగ్డే నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. ఫిబ్రవరి 4న ఆచార్య సినిమాని విడుదల చేయనున్నారు.

ఒక్కసారి తిరిగి చూడు… లేకపోతే తరుగైపోతావు!

Spread the love