Pawan Kalyan on Formation dayPawan Kalyan on Formation day

పవన్ కళ్యాణ్ జన్మదినాన ఐదు సామాజిక సేవా కార్యక్రమాలు
పవన్ కళ్యాణ్ మనసుకి నచ్చే విధంగా కార్యక్రమాలు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం
పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదినాన్ని (Pawan Kalyan Birthday) సామజిక స్పృహతో, అట్టడువర్గాలకు ఉపయోగపడే విధంగా, వినూత్నంగా జరుపుకోవాలని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పిలుపునిచ్చారు. ‘జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమే వేస్తారు. ప్రతి కార్యకర్త తోటి వారికి సాయపడాలన్న అత్యున్నత లక్ష్యంతో ప్రయాణం సాగిస్తారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా జరుపుకోవాలి. సమాజానికి మంచి చేసే విధంగా జనసేనాని జన్మదినాన్ని జరుపుకోవాలి. ఆయన మనసుకు నచ్చే విధంగా ఐదు అంశాలతో కూడిన కార్యక్రమాలకు రూపకల్పన చేశామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు.. ఒకే సమయంలో నిర్వహించాలని నాదెండ్ల కోరారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ మంగళగిరి కార్యాలయం వేదికగా నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంలో తాను స్వయంగా పాల్గొననున్నట్టు మనోహర్ తెలిపారు.

సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాలు, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, నగర అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐదు అంశాలతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పాలు పంచుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో గుర్తించిన అంశాల ఆదారంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాము అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

జనసేన పార్టీ నిర్ణయించిన ఆ ఐదు కార్యక్రమాలు:

  1. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు.
  2. రెల్లి కాలనీలు సందర్శించి వారి మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం
  3. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ.
  4. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వసతి గృహాల సందర్శన. విద్యార్థులకు పుస్తకాలూ, పెన్నులు అవసరమైన వస్తువుల బహుకరణ.
  5. పేదలైన వికలాంగులకు అవసరమైన వస్తువుల బహుకరణ.

ఈ ఐదు అంశాలు పవన్ కళ్యాణ్ కి నచ్చే కార్యక్రమాలు. బైకు ర్యాలీలు, కేకు కటింగులకు సమయం వృథా చేయకుండా ఈ ఐదు అంశాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున నిర్వహించే ఈ కార్యక్రమాలు పది మందికి తెలిసే విధంగా ముందుకు తీసుకువెళ్లాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యక్రమాల వివరాలు ఫోటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఓ ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ ద్వారా ఈ కార్యక్రమాలపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిద్దాం అని నాదెండ్ల మనోహర్ అని తెలిపారు.

ప్రజలు సేనాని వెంట వైసీపీ మాత్రం ఫేక్ సర్వేల వెంట: జనసేన కార్టూన్