వైసీపీని ఘోరంగా ఓడించిన కాంగ్రెస్
ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) జరిగిన జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), ఎన్నికల్లో (Elections) కాంగ్రెస్ (Congress) ఘోరంగా మరొక్కసారి ఓడిపోయింది. కేవలం మూడు అంటే మూడే ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలిచికొంది. జడ్పీటీసీలో అయితే కాంగ్రెస్ బోణీ కూడా చేయలేదు. ఇదీ మన జాతీయ కాంగ్రెస్ పరిస్థితి.
మొత్తం రాష్ట్రంలో మూడు, తూర్పుగోదావరి జిల్లా (East Godavari) లో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలిచికొంది. తూర్పు గోదావరి జిల్లా నుండి కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఒకే ఒక్కడు ఇంటి వీరభద్రరావు (Inti Veerabhadra Rao). తుని (Tuni) నియోజకవర్గం, తొండంగి మండలం (Thondangi Mandal), కృష్ణాపురం (Krishnapuram) గ్రామా ఎంపీటీసీ స్థానంలో భద్రరావు గెలిచి కాంగ్రెస్ పార్టీ పరువుని నిలబెట్టాడు అని చెప్పక తప్పదు. కృష్ణాపురంలో సమీప బలమైన ప్రత్యర్థి వైసీపీని ఘోరంగా ఓడించాడు. చరిత్ర సృటించాడు.
కష్టాల కడలిలో కార్యకర్త
1985 నుండి 2019 వరకు కొంతమంది ప్రత్యర్థి పార్టీ స్థానిక నాయకులు వీరభద్రరావుని అతని కుటుంబాలను పెట్టిన భాధలు వర్ణనాతీతం. వీరభద్రరావు వరి ధాన్యపు కుప్పలను దహనం చేశారు. పోలీసు కేసులు (Police Cases) పెట్టారు. పొలానికి నీరు వెళ్లకుండా ఆపుచేశారు. పొలంలోకి ట్రాక్టర్’ని కూడా వెళ్లకుండా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. వీరభద్రావు తమ్ముడికి ఉద్యోగం రాకుండా చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటినిఅనుమానాలు/అవమాలను వీరభద్రరావు ఎప్పటికీ మరవలేడు.
ఇన్ని హింసలను భరించి కూడా వీరభద్రరావు, అతని కుటుంబం మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు. నేటికీ వీరభద్రరావు ఇంటిమీద కాంగ్రెస్ జండా రెప రెప లాడుతూనే ఉంటుంది.
నాటి మంత్రులు ఏమి చేశారు?
1989 లో గాని ఆ తరువాత 2004, 2009 లలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరూ కూడా తెలుగుదేశంతో (Telugu Desam) ఉన్న రహస్య అవగాహనతో ఉండేవారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తెలుగు దేశం వారికే పనులు చేస్తూ వచ్చారు అనే వారు. వీరిలో కొంతమంది నాయకులు వీరభద్రరావు లాంటి నిజమైన కార్యకర్తలకి అన్యాయం చేస్తూ వచ్చారు. అయినా వీరభద్రరావు కాంగ్రెస్ పార్టీని వీడలేదు.
వీరభద్రరావు కుటుంబం కేంద్ర మాజీ మంత్రి శ్రీ పళ్లంరాజుని (Pallam Raju) నిరంతరం ఆంటిబెట్టుకొని ఉంటుంది. పళ్లంరాజు కూడా వీరభద్రరావు కుటంబానికి దీక్షుచిలా ఉంటూ మెంటర్’గా ఉంటూ వస్తున్నారు. వీరభద్రావు కుటుంబానికి వ్యక్తిగతంగా చాలా బాగా చేశారు. వీరభద్రరావు కుటుంబం అంతా పల్లం రాజు గారికి రుణపడి ఉంటుంది. కానీ కాంగ్రెస్ నాయకులు భద్రరావుని పెట్టె బాధలను, అవమానాలను పల్లంరాజు గారు ఖండించలేక పోయారు అని కూడా అంటుంటారు.
ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లోకి వీరభద్రరావుని రాకుండా చేశారు. అయినా స్థానిక ఎమ్మెల్యేని గాని టీడీపీతో కలిసి పనిచేసిన నాయకులను గాని పళ్లంరాజు నాడు ప్రశ్నించలేదు. అయినా ఆవేదనతో వీరభద్రరావు కాంగ్రెసులో కొనసాగాడు.
అవమానాలు ఎదుర్కొన్న భద్రరావు
అటువంటి పల్లం రాజు కూడా వీరభద్రరావుకి 2013 లో ఒక్క ఎంపీటీసీ టికెట్ ఇప్పించలేక పోయారు. వీరభద్రరావు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశారు. శ్రీ పల్లం రాజు స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులూ చెప్పిన తప్పుడు మాటాలు నాడు విని ఉండవచ్చు. అందుకేనేమో ఒక సీనియర్ నాయకుడికి కేవలం ఎంపీటీసీ సీటు నాడు ఇప్పించలేక పోయారు. దీనితో వీరభద్రరావు కుటుంబం పరువు పోయింది అన్నట్లు ఇబ్బంధులు పడ్డారు. వీరభద్రరావు కుటుంబంలో కూడా అంతర్గత అపోహలు కూడా మొదలు అయ్యాయి.
అయినా వీరభద్రరావు కాంగ్రెస్ పార్టీని వీడలేదు. వీరభద్రావు తమ్ముడు జనసేన (Janasena) అభిమాని. అన్నని జనసేనలోకి మారుద్దాం అని జనసేనుడి మరియు మనోహర్ (Nadendla Manohar) రూమ్ గేటు (కాకినాడ వచ్చినప్పుడు) వరకు తీసికెళ్ళాడు. కానీ నేను పార్టీ మారను అని పారిపోయాడు. నేటికీ చితికి చల్యావస్థలో ఉన్న కాంగ్రెస్లోనే ఉండి పోయాడు.
ఇంటి వీరభద్రరావు గాని అతని కుటుంబం గాని ఎన్నో త్యాగాలు చేసారు. కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ నుండి ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కొంతమంది జిల్లా నాయకులు మాత్రం వీరభద్రరావుకి అన్యాయం చేస్తూనే వచ్చారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా వీరభద్రరావు కాంగ్రెస్లోనే ఉన్నాడు.
గెలిచిన ఒకే ఒక్కడు!
మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసాడు. తన కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళతోనే అన్న తిరుగుతున్నాడు. తమ్ముడు జనసేన అంటూ కలవడం లేదు అనే భాధ ఉన్నాగాని ఒంటరిగా పోటీ చేసాడు. పోటీ చేసి కాంగ్రెస్ నుండి విజయం సాధించాడు. కాదు కాదు కృష్ణాపురం ప్రజలు వీరభద్రరావు నిజాయితీకి పట్టం కట్టారు. ఆ గ్రామ ప్రజలకు, కొంత మంది స్థానిక నాయకులకు వీరభద్రరావు కుటుంబం రుణపడి ఉంటుంది.
రేపటి రోజున మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే? వీరభద్రరావు లాంటి కార్యకర్తల త్యాగాలు వీరికి గుర్తుకి వస్తాయా? లేక కొత్త నాయకుల పీఏలకు ఒక మందు సీసా ఇచ్చేస్తే కార్యకర్తలను మరిచిపోతారా? గతాన్ని మరిచిపోయి వీరభద్రరావు లాంటి వారికి అన్యాయం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారా?
కింకర్తవ్యం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వారు నేడు పక్క పార్టీలకు పోయి అక్కడ కూడా పదవులను అనుభవిస్తున్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని వీరికి అనిపిస్తే మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్’లోకి వచ్చేస్తారు. మళ్ళీ పదవులకు కుర్చీఫులు కట్టేస్తారు. ఇంటి వీరభద్రరావు లాంటి నిజాయితీతో పార్టీ వీడని వారికి అన్యాయం చేయడం మొదలు పెడతారు. సహాయకులను ఒక మందు సీసా ఇస్తే చాలు అడగాలిసిన వాళ్ళు, అడగడం మానేసి సేద తీరుతుంటారు అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వీటిని సరిదిద్దండి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. లేకపోతే మన జాతీయ కాంగ్రెస్ పార్టీ దీన గాధలు వినడానికి వీరభద్రరావు లాంటి నిజమైన కార్యకర్తలు కూడా దొరకక పోవచ్చు.
కాంగ్రెసులో ఇప్పటికీ ఉన్న ప్రతీనాయకుడు, కార్యకర్త ఒక్కసారి ఆలోచించండి?
(ఇది నిజమైన ఒక పార్టీ కార్యకర్త ఆవేదన మాత్రమే)