ప్రశ్నల పరంపరకు తెరపడింది!
నర్సాపురం ఎంపీ రఘురామ రాజును (Raghu Rama Raju) ఏపీ సీఐడీ (APCID) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్’లోని (Hyderabad)ఆయన ఇంటికి వెళ్లిన సీఐడీ (CID) అధికారులు రఘు రామని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. రఘురామ కృష్ణరాజుపై పలు సెక్షన్ల క్రింద నాన్ బెయిలబుల్ (Nonbailable) కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది.. రాష్ట్ర ప్రభుత్వ (AP Government) ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రఘు రామని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ (CRPF) పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తున్నది. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే, బలవంతంగా ఆయన్న ఏపీ పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారని సమాచారం. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చర్చనీయాంశం.
ఏపీ సర్కార్‌పై రఘురామ గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ తప్పు ఒప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది.