Mega brothersMega brothers

ప్రజారాజ్యం (Prajarajyam) ఓటమి-విలీనం
మూడు పెళ్లిళ్లు (Three marriages)
ఏకాకిగా మిగిలిన కాపు కులం (Kapu Caste)
అనే మూడు గుదిబండలు వేలాడుతుండగా

జనసేన (Janasena) అనే పార్టీని పెట్టిన ధీరుడు-మగధీరుడు-ధైర్యవంతుడు.

చేతిలో చిల్లి గవ్వ లేక పోయినా
ఒక్క ఛానల్ లేదా పేపర్ (Media) వెనుకలేక పోయినా
ఫైనాన్సింగ్ చేసే ఒక్క కార్పొరేట్ వెంటలేక పోయినా
తన కుటుంబం గాని, కులం గాని వెన్నంటి లేకపోయినా
చెప్పుకో తగ్గ నాయకులూ పదిమంది కూడా తోడు లేక పోయినా

జనసేన అనే పార్టీని తొమ్మిది సంవత్సరాలుగా మొండితనంతో కొనసాగిస్తున్న వ్యక్తి జనసేనాని (Janasenani).

ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కొనసాగిస్తున్న జనసేనాని ఇప్పటికీ అభినందనీయుడే.
అయన వ్యూహాలు అమోఘమే. పార్టీ అధికారంలోకి రాకపోయినా పాలక పార్టీలను గడ గడ లాడిస్తూ, వారికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

ఒకపక్క పచ్చ మీడియా (Pacha Media) విష ప్రచారం
ఇంకొక పక్కన నీలి మీడియా (Blue media) ఫ్యాక్షన్ ప్రచారాలు
మరొక పక్కన అక్కరకు రాని కులసంఘాలు (Kula sanghalu)
ముఖ్యంగా దొడ్డలతో పెనవేసుకుపోయిన కుల ఉద్యమ ముద్రలు (Kapu Udhyamalu);
ప్యాకేజీ స్టార్ (Package star) అనే అవినీతి పార్టీల కొమ్ము కాస్తున్న అజ్ఞానపు కులమేధావులు (Intellectuals);

అయినను జనసేనాని ప్రజల ఆలోచనల్లో మార్పు తీసికొస్తున్నాడు. మార్పు కోసం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావలి అనే ఆశలను ప్రజల్లో పవన్ నిత్యం రేకెత్తిస్తున్నాడు. దీనికి జనసేనానిని అభినందించాల్సిందే.

కానీ కానీ కానీ

కానీ పచ్చ బాబు (Pacha babu) ట్రాప్ నుండి బయట పడలేక పోవడం;
తన చుట్టూ ఉన్న డ్రామోజీ రావు (Dramojee Rao) భటులను వదిలించుకోలేక పోవడం;
అవసరం లేని పొత్తుల కోసం (Alliances) వెంపర్లాడడం;
తన వారు ఎవరో-శత్రువులు ఎవరో ఇప్పటికీ కూడా తెలిసికోలేక పోవడం;

అనే బలహీనతలను జనసేనాని వదిలించుకోలేక పోతున్నాడు అనే అనుమానాలు ప్రజల్లో నాటుకుపోయాయి.

ఈ బలహీనతలను తెలిసికొని జనసేనాని మసలుకోగలిగితే,

ఈ విమర్శలను తిప్పికొట్టే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసికోగలిగితే
రాబోయే అధికారం (Rajyadhikaram) జనసేనానిదే;

ఆలోచించండి… ఆ రెండు పార్టీలకు సమ దూరం పాటిస్తేనే జనసేనకు మనుగడ అని గుర్తించండి (Its from Akshara Satyam)

రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరణ