SirivennelaSirivennela

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
అంటూ అ ఆధిభిక్షువుని నిగ్గతీసి అడగడానికి
శివ సాన్నిధ్యం చేరిన సిరివెన్నెల…

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? అంటూ సమాజాన్ని నిగ్గదీసిన ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ (Sirivennela Sitarama Sastry) (66) ఇక లేరు. అయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సికింద్రాబాద్‌ (Secunderabad) కిమ్స్‌ (Kims) ఆసుపత్రిలో (Hospital) చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు కన్నుమూశారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించి సిరివెన్నెల తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.భాస్కరరావు తెలిపారు.

సిరివెన్నెల (Sirivennela) మృతికి ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) జస్టిస్‌ ఎన్‌వీ రమణ (N V Ramana), తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌ (KCR), జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతా రచయిత విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. ఆ తరువాత కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు.

ఆంధ్ర విశ్వకళా పరిషత్లో (Andhra University) బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ (K Viswanath) సిరివెన్నెల సినిమాకు[1] పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది. అలా ప్రవేశించిన ఆయనకు ఎన్ని పురస్కారాలు దక్కాయి. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ (Padmasri) కూడా లభించింది.

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ .సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య ‘పద్మావతి’ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ ‘వై. సత్యారావు’ని చెబుతుండేవారు.

సిరివెన్నెల కలం నుండి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు

ఆరంగేట్రం సిరివెన్నెల లోని ప్రతి పాట అణిముత్యమే అని చెప్పుకోవాలి. స్వయంకృషిలోని పాటలు, రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలు కూడా సంచలనం సృటించాయి అని చెప్పాలి. స్వర్ణకమలంలోని అన్ని పాటలు – ముఖ్యంగా : ‘ఆకాశంలో ఆశల హరివిల్లూ ; ‘అందెల రవమిది, శృతిలయలులో – తెలవారదేమో స్వామి చిరస్థాయిగా మిగిలిపోతాయి.

శివలో బోటని పాఠముంది క్షణక్షణంలో కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా,
గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు లాంటి పాటలకు పలు విశిష్టమైన అవార్డులను వచ్చాయి. గులాబిలో ఏ రోజైతె చూశానో నిన్నూ, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ, మనీలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ రాసిన పాటలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి. ఇలా ఎన్నోవేల పాటలను సిరివెన్నెల తెలుగు ప్రజలకు అందించారు.

విషాదంలో చిత్రపరిశ్రమ

తెలుగు సినిమా పాటకు రెండు కళ్లలాంటి వారు వేటూరి, సిరివెన్నెల. వేటూరి మనకు ఇదివరకే దూరం అయ్యారు. ఇప్పుడు సిరివెన్నెల సెలవు పలకడంతో తెలుగు పాట విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. సిరివెన్నెల ఇక లేరని తెలియగానే చిత్రసీమ మూగబోయింది. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, తోటి రచయితలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1986 – సిరివెన్నెల – విధాత తలఁపున…

1987 – శ్రుతిలయలు – తెలవారదేమో …

1988 – స్వర్ణకమలం – అందెల రవమిది…

1993 – గాయం – సురాజ్యమవలేని…

1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక…

1995 – శ్రీకారం – మనసు కాస్త కలత…

1997 – సింధూరం – అర్ధ శతాబ్దపు…

1999 – ప్రేమకథ – దేవుడు కరుణిస్తాడని…

2005 – చక్రం – జగమంత కుటుంబం నాది…

2008 – గమ్యం – ఎంతవరకూ ఎందుకొరకూ…

2013 – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – మరీ అంతగా.. (నంది పురస్కారం – 2013 నంది పురస్కారాలు)

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఉత్తమ గేయరచయితగా :

2005 – నువ్వొస్తానంటే నేనొద్దంటానా –

2008 – గమ్యం – ఎంతవరకు…

2009 – మహాత్మ – ఇందిరమ్మ

2015 – కంచె

కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1986 – సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం

1992 – అంకురం – ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు

1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక

1995 – పెళ్ళి సందడి – హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా

మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక

1995 – పెళ్ళి సందడి – హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా

1998 – మనసిచ్చి చూడు – బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!

1999 – అల్లుడుగారు వచ్చారు – నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషినికానా

కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1998 – మనసులో మాట – ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా

భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1992 – సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం

1996 – పవిత్రబంధం – అపురూపమైనదమ్మ ఆడజన్మ – ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ

1999 – భారతరత్న – మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!

అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

1999 – భారతరత్న – పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ

2000 – నువ్వు వస్తావని – పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి

వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :

2000 – నువ్వే కావాలి సినిమా గేయ రచయితగా :

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు

అనగనగా ఆకాశం వుంది – ఆకాశంలో మేఘం ఉంది

ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి

రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

1988 – కళ్ళు – తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ

బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :

1999 – తులసి దళం, టి.వి. సీరియల్ – హాయిగా వుంది, నిదురపో

(Source: various article taken from web)

సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం

Spread the love