రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు చెల్లదు
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే వైయస్ జగన్ (YS Jagan) ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లామన్నారు. రాజధాని అంశం (Capital issue) రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్ర ప్రభుత్వం (Central Government) పార్లమెంట్ (Parliament) సాక్షిగా చెప్పిందని అమరనాధ్ గుర్తుచేశారు.
శివరామకృష్ణన్ కమిటీ (Siva Rama Krishnan Commission) నివేదిక ఇవ్వకముందే టీడీపీ ప్రభుత్వం (TDP Government) అమరావతి (Amaravati) రాజధానిగా (Capital) ప్రకటించారు. రాజధానిపై చంద్రబాబు (Chandra Babu) వేసింది ఎక్స్‌పర్ట్ కమిటీ (Expert Committee) కాదు. ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ (Investment Committee) అని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. రాజధాని ఏర్పాటుపై చట్టసభలకు హక్కు లేదన్న అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. విశాఖపట్నంలో (Visakhapatnam) మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జరిపిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు (State Assembly) లేదని హైకోర్టు (AP High Court) పేర్కొన్నoదువల్లనే, రాజ్యాంగ పరంగా శాసనసభకు ఉన్న హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు.
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణే (Decentralization) వైసీపీ ప్రభుత్వ (YCP Government) విధానమని అన్నారు. దానికి మరింత బలం చేకూర్చడం కోసం, రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం అని ఆయన స్పష్టం చేశారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ (Special leave petition) ద్వారా సుప్రీంకోర్టు తెలియజేశామని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం చట్టసభలకు లేదన్న అంశంపై.. దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అని అమర్నాథ్ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ (AP CM Jagan) ప్రయత్నాలు సాగిస్తుంటే, కేవలం అమరావతిలోని 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని కుట్రలు పన్నుతున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు.
ప్రభుత్వ పిటిషన్‌లోని కీలకాంశాలు (Main points in Government petition)
ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం-2020, అమరావతి, విశాఖ, కర్నూలులను శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానులుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఏపీ రాజధాని అభివృద్ధి అథారిటీ రద్దు చట్టం- 2020 ఉపసంహ రించుకుంటూ ‘ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ రిపీల్ బిల్- 2021ను అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. చట్టాలే రద్దయినప్పుడు వాటిపై ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదు.
రాజధాని కార్యకలాపాలను ఎక్కడినుంచి నిర్వహించాలని నిర్ణయించుకునే హక్కు సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రానికీ ఉంటుంది. ఈ అధికారం రాష్ట్రానికి లేదనడం రాజ్యాంగ మూలసూత్రాలకు (Basic principles of Constitution) విరుద్ధం.
శాసనవ్యవస్థను నిలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం చెప్పిన అధికార విభజన సూత్రాన్ని (Division of power) ఉల్లంఘించడమే. అందువల్ల ఈ తీర్పును నిలువరించాలి అనేవి రాష్ట్ర ప్రభుత్వ వాదన.