ఆకుమర్రు, బేవరపేటల్లో వైసీపీ దౌర్జన్యం
వైసీపీ నాయకుల (YCP Leaders) రాక్షస పాలనకు (Raksasa Palana) అంతు లేకుండా పోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం (Pedana) గూడూరు మండలం ఆకుమర్రులో జనసేన నాయకులూ (Janasena Leaders) కార్యకార్లపై వైసీపీ (YCP) దాడులు చేసింది.
అలానే ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజక వర్గం బెవరపేట ( Bevarpeta) గ్రామాల్లో జనసైనికులపై వైసీపీ దుండగులు జరిపిన దాడిలో ఆకుమర్రులో ముగ్గురు, బెవరపేటలో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు.
రెండుచోట్లా దాడులకు కారణం ప్రజల తరఫున వైసీపీ అక్రమాలను జనసైనికులు ప్రశ్నించడమే. రెండు చోట్లా దాడిచేసినవారే పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. అది కూడా సానుభూతి కోసం మహిళలతో కేసు పెట్టించడం వైసీపీ వికృత చేష్టలకు పరాకాష్ట అని చెప్పక తప్పదు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
చెరువు పూడికతీతలో అక్రమాలు
ఆకుమర్రు చెరువు పూడికతీతలో అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న జనసైనికులు హరిరామ్, న్యాయవాది, రామకృష్ణ, గణపతి ఆకుమర్రు వెళ్లి చెరువు పనులను ఫోటోలు తీశారు. వారి ఫోటోలు తీస్తుండగా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు జన సైనికులను నిర్బంధించి, తీవ్రంగా హింసించారు. హింసించి చివరికి వారిని పోలీసులకు అప్పగించి తమపై దాడిచేయడానికి వచ్చారని ఎదురు కేసుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుని తల్లితో ఈ కేసు పెట్టించారని నాదెండ్ల మనోహర్ వైసీపీని దుయ్యబట్టారు.
స్టిక్కర్లు అతికించవద్దు అంటే దాడులా?
జగనన్న స్టిక్కర్లను తమ ఇళ్లకు అంటించవద్దని వారం కిందట బెవరపేటలో జనసైనికులు అన్నారు. దానికి తోడు ఊరిలో జరుగుతున్న చెరువు పూడికతీతలో అక్రమాలను ప్రశ్నించడానికి జనసైనికులు సిద్ధం అయ్యారు. దీనితో జనసైనికులపై వైసీపీ సంఘవిద్రోహశక్తులను రప్పించి జనసైనికులపై విచక్షణరహితంగా దాడి చేయించారు. 12 మంది గాయపడగా ఎనిమిది మందిని స్థానిక ఆస్పత్రిలోను, ఆందోళనకరంగా ఉన్న మరో నలుగురు క్షతగాత్రులను విజయనగరం ఆస్పత్రిలోనూ చేర్పించారు.
ఈ జిల్లాకు నేనే పెద్ద దిక్కు అని చెప్పుకునే నాయకుని సోదర దళం గాయపడిన జనసైనికుల కుటుంబాలను కేసు పెట్టవద్దని బెదిరింపులకు దిగడం గమనార్హం.
ఎన్నాళ్ళు ఇటువంటి రాక్షస సంస్కృతిని వైసీపీ పెంచి పోషిస్తుంది? ఈ రెండు సంఘటనలపై పోలీస్ అధికారులు జోక్యం చేసుకోవాలని జనసేన పక్షాన కోరుతున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
దోషులను కఠినంగా దండించాలని, ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి చేటని గుర్తుంచుకోవాలి. దోషులపై సరైన కేసులు పెట్టని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. గాయపడిన జనసైనికులకు అన్ని విధాలుగా జనసేన అండగా ఉంటుందని పార్టీ తరపున తెలియచేస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు.