కదనోత్సాహంతో మత్స్యకార అభ్యున్నతి సభ
జనసేనాని ప్రసంగంలోని కీలక అంశాలు
మత్సకార అభ్యున్నతి సభ (Matsakara Abhyunnati Sabha) విజయవంతం అయ్యింది. జనసేనాని ప్రసంగ (Janasenani Speech) సమయం తక్కువే. కానీ సూటిగా సుత్తి లేకుండా ప్రభుతాన్ని కడిగి పారేసినట్లు అని పించింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నరసాపురంలో (Narasapuram) జరుగుతున్న ఈ మత్సకార అభ్యున్నతి సభ మత్సకారులు (Matsakara), జనసైనికులతో (Janasainiks) కిక్కిరిసి పోయింది.
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగం మత్సకారులను ఆకొట్టుకొంది. జనసేనాని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జనసేనాని కేవలం మత్సకార సమస్యలపైనే ద్రుష్టి పెట్టి మాట్లాడారు. వ్యూహాత్మకంగానే జీవోని చింపి పారేశారు అని అనిపిస్తున్నది. ఈ సభ అణగారిన వర్గాల్లో (Suppressed classes), జనసైనికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది అని చెప్పాలి.
Meeting High Lights:
- మత్స్యకారుల అభ్యున్నతి కొరకు మొదలైన మత్స్యకార అభ్యున్నతి యాత్ర నేడు తుది దశకు చేరుకుంది. గత పది రోజుల నుండి జనసేన ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఈ యాత్రలో పాల్గొన్నారు.
- సభా ప్రాంగణం వద్ద జనసేనానివి రెండు భారీ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో కటౌట్ దాదాపు 50 అడుగుల పైబడి ఉన్నాయి. స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు నాదెండ్ల మనోహర్, కోటికలపుడి గోవింద రావు మరియు బొమ్మిడి నాయకర్ (Bommidi Nayakar) ఫోటోలు ఉన్న ఈ భారీ కటౌట్లు సోషల్ మీడియాలో (Social Media) హల్ చల్ చేస్తున్నాయి.
- మత్సకారులు, జనసైనికుల తాకిడితో పోటెత్తిన సముద్రంలా సభా ప్రాంగణం మారింది.
- జనసేనానికి అడుగడుగునా ఘనస్వాగతం (Grand Welcome) లభించింది. ఆడపడుచుల హారతులతో, పూల వర్షం మధ్య, జనసైనికుల కోలాహలం నడుమ జనసేనాని పాలకొల్లు చేరుకొన్నారు.
- మత్స్యకార అభ్యున్నతి సభా ప్రాంగణానికి మరికొంత దూరంలోనే ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్.
- రాజీలేని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టికి మత్సకార సమస్యలను తీసుకొచ్చాక తప్పకుండా మీ సమస్య తీరుతుంది: మత్స్యకార అభ్యున్నతి సభలో నాగబాబు
- ప్రభుతాన్ని దుయ్యబడుతూ , చెలరేగి మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్.
- సమస్యల సృష్టికర్తనే మన ముఖ్యమంత్రి. అయన సృష్టిస్తాడు. అయన పరిస్కరిస్తున్నట్లు నటిస్తారు: నాదెండ్ల మనోహర్.
- ఒక్క సంవత్సరం జనసైనికులు కష్టపడితే చాలు. ఆ తరువాత అధికారం జనసేన పార్టీదే: నాదెండ్ల మనోహర్.
జనసేనాని ప్రసంగంలోని ముఖ్యంశాలు
- జై ఆంధ్ర ప్రదేశ్. జై జనసేన. జై భారత్ అని తన ప్రశాంతాన్ని ప్రారంభించిన జనసేనాని పవన్ కళ్యాణ్.
- వైసీపీ పార్టీ పిచ్చి పిచ్చి వేషాలకు, భేదిరింపులకు జనసేన పార్టీ భయపడదు.
- 60 – 70 లక్షలు ఉన్న మత్సకార 32 కులాలకు ప్రయోజనం చేకూర్చాలన్నదే నేటి సభ ఉద్దేశం.
- జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు గాని ఉండి ఉంటే జీవో 217 ని గట్టిగా ఎదుర్కొనే వాళ్ళం.
- జీవో చింపినందుకు నా మీద కేసులు పెట్టుకొంటే పెట్టుకోండి. జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధమే.
- జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టింది వంగి వంగి దండాలు పెట్టడానికి కాదు.
- ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతూ కూడా మత్సకారులకు సాయం చేయలేక పోయింది. కానీ అన్ని చోట్ల ఓడిపోయిన జనసైనికులు సాయం చేయగలుగుతున్నారు.
- ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది చికెన్ షాపులు, మటన్ షాపుకు పెట్టమనా?
- మత్సకారులు జనసేన పార్టీకి అండగా ఉండండి. మేము మీకు అండగా ఉంటాం. మేము చికెన్ షాపులు, మటన్ షాపులు పెట్టం. కానీ మీ భవిషత్తు మార్చడానికి అండగా ఉంటాం.
- మత్సకారులకు ఎటుచూసినా నీళ్లు ఉంటాయి. కానీ తాగడానికి మాత్రం నీళ్లు ఉండవు. దీనిపై వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు.
- వైసీపీ (YCP) వాళ్ళకే డబ్బులు ఉండాలి. మిగిలిన వాళ్ళు అందరూ చేతులు కట్టుకొని వాళ్ళని ప్రాధేయ పడాలి. ఇదేమిటి? ఇదేమైనా ఫ్యూడలిస్టిక్ సమాజమా?
- వైసీపీ నాయకులూ (YCP Leaders) ఏమైనా ఆకాశం నుండి దిగి వచ్చారా? చట్టాలు వైసీపీ నాయకులకు వర్తించవా? మీరు ఎంతమందిని జైలులో పెడతారు. నేను జైలుకు వెళ్ళడానికి సిద్దమే. పెట్టండి చూద్దాం. మీరు YCP వాళ్ళకి భయపడవద్దు. మీకు అండగా జనసేన పార్టీ (Janasena Party) ఉంది.
- మీరు జనసేనకు అండగా ఉంటే ఏమైనా మనం చేయగలను. నేను చావడానికి సిద్దమే గాని తల దించడానికి మాత్రం సిద్ధం కాను. జనసేనని గెలిపించండి. ప్రభుత్వము అంటే ఏమిటో చూపిస్తాం.
- వైసీపీ వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించక పోగా… ఉపాధి అవకాశాలను తీసేస్తున్నారు.
- ఏ రాష్ట్రంలో కూడా ఈ జీవో 217 లేదు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్’లోనే (Andhra Pradesh) ఉన్నది. ఇది మత్సకారులకు అన్యాయం చేస్తుంది.
- ఒక్కడికి గుండె ధైర్యం వస్తే మిగిలిన వారికి గుండె ధైర్యం వస్తాది. అందుకే కేసులు పెడతారు అని కూడా జీవోని చించి పారేసాను. 2024 లో జనసేన ప్రభుత్వం వచ్చి తీరుతుంది. అప్పుడు జనసేన ప్రభుత్వం మత్సకారుల సమస్యలను సంపూర్ణంగా తీరుస్తుంది. జనసేన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ జీవో 217 ని రద్దు చేసి తీరుతుంది.
- నేను పార్టీ పెట్టడానికి గుండే ధైర్యాన్ని ఇచ్చింది జనసేన (Janasena) వీర మహిళలు (Veera Mahila), జనసైనికులే.
- మనం తిరిగి మార్చ్ 14 న కలుద్దాం. రాష్ట్రాన్ని కాపాడడానికి మనం ఎలా సిద్ధం కావలి అనే దాన్ని గురించి ఆ రోజున చర్చిద్దాం.
- జై హింద్ అని చెప్పి జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముంగిచారు.
కొసమెరుపు:
- 2024 లో జనసేన ప్రభుత్వం వస్తుంది అనిజనసేనాని పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు టీడీపీతో పొత్తు లేనట్లే అని దీనిని బట్టి అర్ధం అవుతున్నది. ఇది విని కూడా టీడీపీతో జనసేన వెళుతుంది అనే వారు నిజంగా జనసైనికులేనా అని అనుమానం పడాల్సిన అవసరం ఉందేమో.
పెద్దరికం వెంపర్లాటలో మోహన్ బాబుకి తగిన గుణపాఠం!