CM with ChiruCM with Chiru

ముఖ్యమంత్రి (Chief Minister) వైయస్‌ జగన్‌ (YS Jagan) సినిమా పరిశ్రమకు (Film Industry) సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సంతృప్తి పరిచాయని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. సినిమా టికెట్ల (Cinema Tickets) ధరలకు సంబంధించిన అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చకు ఆహ్వానించిన సీఎం వైయస్‌ జగన్‌కు (Jagan) సినీ పరిశ్రమ తరఫున చిరు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌తో సినీ పరిశ్రమ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళీ, అలీ, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్‌రెడ్డి సీఎం జగన్’తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం సీఎం క్యాంపు కార్యాలయ (CM Camp Office) ఆవరణలో టాలీవుడ్‌ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ..

తక్కువ రేట్లకు వినోదం ప్రజలకు అందాలనే ఆశయానికి, ఇండస్ట్రీకి కూడా రెవెన్యూ రావాలనే దానిపై అన్ని రకాలుగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం అందరినీ సంతృప్తి పరుస్తుంది అన్నారు. అందుకు సీఎంకు పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాల మీద సీఎం ప్రత్యేకంగా దృష్టిసారించి చిన్న సినిమాలు విజయవంతం కావాలి అని సీఎం అన్నారు. చిన్న నిర్మాతలు, దర్శకులు ఉంటే అందరికీ మంచి ఉపాధి ఉంటుందని ఉద్దేశంతో ఐదు షోలకు ఆమోదం తెలపడం సంతోషకరమైన విషయమని చిరంజీవి అన్నారు.

దేశంలో మన తెలుగు సినిమా (Telugu Cinema) గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ కీర్తిస్తున్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసే స్థాయికి మన తెలుగువారు రావడం, ఆ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి వస్తున్నది. అలాంటి వాటికి ప్రత్యేక వెసులుబాటు చేయాలనే విషయంపై కమిటీతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పడం అందరికీ సంతృప్తిని ఇచ్చింది అని చిరు వివరించారు.

తెలంగాణలో (Telangana) ఎలా చిత్ర పరిశ్రమ (Film Industry) అభివృద్ధి చెందిందో అదే విధంగా ఏపీలో అభివృద్ధి చెందాలి అని సీఎం అన్నారు. అందుకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పడం సంతోషమని చిరు తెలిపారు. విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని సీఎం చెప్పారని చిరు అన్నారు. సినిమా ఇండస్ట్రీకి మేలు చేయడం కోసం సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని తీసుకున్న చొరవకు మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల మూడో వారంలో ప్రభుత్వం ఉత్తర్వులు (Government orders) ఇచ్చే అవకాశం ఉందని చిరు (Chiru) వివరించారు.

కొత్త జిల్లాల‌పై సీఎం జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు!

Spread the love