రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు ఢిల్లీ రాక!
భారత్ (Bharat), రష్యాల (Russia) ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు గాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) నేడు ఢిల్లీకి (Delhi) వస్తున్నారు. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), పుతిన్ భేటీ కానున్నారు. అలానే ఇరు దేశాల విదేశాంగ (External affairs), రక్షణ శాఖల (Defence) మంత్రులు కూడా భేటీ కానున్నారు.
రెండు దేశాల మధ్య ఈ తరహా చర్చలు జరగడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. ఇండియా (India) ఇప్పటివరకు అమెరికాతో (America) మాత్రమే 2+2 తరహా చర్చలు జరిపింది. పుతిన్ పర్యటన ఇరుదేశాల చిరకాల మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా ఉండవచ్చు. దీని ద్వారా రక్షణ, అణు, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేయనుందని ఆశిస్తున్నారు. చైనా (China) ప్రాబల్యాన్ని ఇండో-పసిఫిక్ (Indo Pacific) ప్రాంతంలో నిలువరించేందుకు ఏర్పడిన అమెరికా (America), జపాన్ (Japan), ఆస్ట్రేలియా (Australia) , భారత్ క్వాడ్ కూటమిపై అసంతృప్తిగా ఉన్న మాస్కో ఇటీవల బీజింగ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటోంది అనేది తెలుస్తున్నది.
మరోవైపు రష్యా నుంచి ఎస్-400 క్షిపణులతో పాటు పలురకాల ఆయుధ సంపత్తిని ఇండియా సమకూర్చుకుంటోంది. చైనా నుంచి ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతోనే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో పుతిన్ పర్యటన అంశాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.